Ukraine Students: ‘సీఎం జగన్‌కు కృతజ్ఞతలు’, ‘చాలా భయం వేసింది’

యుక్రెయిన్ నుంచి మూడో ఎయిరిండియా విమానం ఇండియాకు చేరుకుంది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లలో భాగంగా మూడు విమానాల్లో 907 మంది....

Ukraine Students: ‘సీఎం జగన్‌కు కృతజ్ఞతలు’, ‘చాలా భయం వేసింది’

Ukraine Students (1)

Ukraine Students: యుక్రెయిన్ నుంచి మూడో ఎయిరిండియా విమానం ఇండియాకు చేరుకుంది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లలో భాగంగా మూడు విమానాల్లో 907 మంది భారతీయులను స్వదేశానికి తీసుకురాగలిగింది కేంద్రం.

చివరిదైన మూడో విమానంలో 198 మందితో రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు.

తొలి రెండు విమానాల్లో బయల్దేరిన విద్యార్థుల్లో తెలుగు వారు ఉన్నారు. ఈ సందర్భంగా యుద్ధ వాతావరణం నుంచి బయటపడ్డ వారి మాటలు ఇలా ఉన్నాయి.

ఉక్రెయిన్ లో మేము ఉంటున్న హాస్టల్ వెనుక భయాందోళనక పరిస్థితులు నెలకొన్నాయి. రొమేనియా బోర్డర్ నుంచి మమ్మల్ని సేఫ్‌గా హైదరాబాద్ తీసుకొచ్చారు. యుద్ధం జరుగుతుందని సమాచారం అందిన వెంటనే పేరెంట్స్‌కి సమాచారం ఇచ్చాం. ఆ తరువాత ఎంబసీ అధికారులకు సంప్రదించాం. మాతో పాటు చాలామంది తెలుగు స్టేట్స్ స్టూడెంట్స్ అక్కడే ఉన్నారు. సేఫ్‌గా తిరిగి వస్తాం అనుకోలేదు. ఇంత త్వరగా స్పందించి తమను సేఫ్‌గా ఇంటికి చేర్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు– బుక్కోమినియా యునివర్సిటీ స్టూడెంట్ శ్రీనివాస్

Read Also : రష్యాకు ఎదురుదెబ్బ..! 4,300 మంది సైనికులను హతమార్చామన్న యుక్రెయిన్

ఈ రోజు ఉదయం ప్రతేక విమానంలో మా కూతురు ఇంటికి చేరుకుంది. 2016లో మెడిసిన్ కోసం యుక్రెయిన్ వెళ్లింది. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇంటికి సేఫ్ గా రీచ్ అవడానికి కారకులైన సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ మా కుటుంబం తరపున ప్రతేక కృతజ్ఞతలు  – పేరెంట్ లక్ష్మణ్

మా కూతురు ఇంటికి రావడం హ్యాపీగా ఉంది. యుక్రెయిన్‌లో దాడులు బాంబు పేలుళ్లు అదంతా చూసి తమ కూతురికి ఏం అవుతుందో అని ఆందోళన పడ్డా. మా కుతురిని రొమేనియా నుంచి బస్సు మార్గంలో ఎంబసీ అధికారులు తీసుకువచ్చి ఎయిరిండియా విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. మా పాప ఉక్రెయిన్‌లోని బుకోవినియం యునివర్సిటీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. యుక్రెయిన్‌లో చిక్కుకున్న వారిని అందరినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సేఫ్ గా గమ్య స్థానాలకు చేర్చితరాన్న నమ్మకం తమకు కలుగుతోంది స్టూడెంట్ తల్లి.

రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కృషి చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు. అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. బోర్డర్ దాటడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మొదటి సారి స్వదేశానికి మేం వచ్చాం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా సేఫ్ గా ఇంటికి వచ్చాం. అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ ను కూడా స్వదేశానికి తీసుకురావాలని కోరుతున్నాం. కీవ్ లో బ్లాస్ట్ అయిన సమయంలో మా ఫ్రెండ్స్ దగ్గరలో ఉన్నారు. మమ్ములను ఫ్లైట్ ఎక్కించే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా బాగా పనిచేశాయి– స్టూడెంట్

 

Read Also : యుక్రెయిన్ న్యాయపోరాటం.. రష్యా దాడులపై అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్

అక్కడ పరిస్థితిని చూసి చాలా భయపడ్డాం. కానీ మా పాప సేఫ్ గా ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంటికి తీసుకువచ్చేందుకు కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు. సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవతో మిగిలిన విద్యార్థులు కూడా స్వదేశానికి వస్తారు. యుక్రెయిన్ లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు– పేరెంట్స్