Nuclear Power Plants : యుక్రెయిన్‌పై ఆగని రష్యా దాడులు.. అణు విద్యుత్తు ప్లాంట్ల భద్రతపై ఆందోళన..!

రష్యా దాడులతో యుక్రెయిన్‌లో అణు విద్యుత్తు కేంద్రాల భద్రతపై ఆందోళనను రేకిత్తిస్తోంది. అణువిద్యుత్తు కేంద్రాలకు ఏదైనా ప్రమాదం ఎదురైతే పెను ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Nuclear Power Plants : యుక్రెయిన్‌పై ఆగని రష్యా దాడులు.. అణు విద్యుత్తు ప్లాంట్ల భద్రతపై ఆందోళన..!

Ukraine Nuclear Plant Ukraine Nuclear Power Plants Are At Risk As Russia Fighting Continues In Ukraine

Nuclear Power Plants : రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధ కొనసాగుతూనే ఉంది. వారానికి పైగా యుక్రెయిన్‌లో రష్యా బలగాలు ఏకధాటిగా దాడులు చేస్తూనే ఉన్నాయి. మొదటగా యుక్రెయిన్ సైనిక స్థావరాలపై దాడులు చేసిన రష్యా.. యుక్రెయిన్ జనావాసాలపై కూడా బాంబుల వర్షాన్ని కురిపించాయి. ఎంతోమంది యుక్రెయిన్ పౌరుల ప్రాణాలను బలితీసుకుంది రష్యా… యుక్రెయిన్ కివ్ సహా ప్రధాన నగరాలను ఆక్రమించుకునేందుకు ఎంతకైనా తెగించేందుకు రష్యా ప్రయత్నిస్తోంది.

ఆఖరికి అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలైన అణు విద్యుత్ కేంద్రాలను కూడా వదలడం లేదు. ఆ ప్రాంతాల్లోనూ రష్యా రాకెట్లతో దాడి చేస్తోంది. ఈ క్రమంలో యుక్రెయిన్‌లోని యూరప్‌ అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రమైన జప్రోజహియ న్యూక్లియర్ ప్లాంట్‌పై రష్యా రాకెట్లతో దాడులు చేసింది. ఈ దాడులతో అణు విద్యుత్ ప్లాంట్ లో మంటలు చెలరేగాయి. పొరపాటున ఈ అణు ప్లాంట్ పేలితో భారీ వినాశనం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఈ దాడి ఘటనతో యుక్రెయిన్‌లో అణు విద్యుత్తు కేంద్రాల భద్రతపై మరింత ఆందోళనను రేకిత్తిస్తోంది. రష్యా దాడుల్లో అణు విద్యుత్తు కేంద్రాలకు ఏదైనా ప్రమాదం ఎదురైతే పెను ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ ఘటన పునరావృతం అవుతుందనే ఆందోళన ఎక్కువుతోంది.

అణు విద్యుత్తు కేంద్రాలు అధికంగా ఉన్న యుక్రెయిన్‌ ప్రాంతంలోనే రష్యా దాడులకు దిగడం అత్యంత ప్రమాదకరమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఈ అణు రియాకర్లు ఎన్నో ఏళ్ల క్రితమే ఇక్కడ నిర్మించారు. యుక్రెయిన్‌ కూడా వాటి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకొంటున్నట్లు కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Ukraine Nuclear Plant Ukraine Nuclear Power Plants Are At Risk As Russia Fighting Continues In Ukraine (1)

Ukraine Nuclear Plant Ukraine Nuclear Power Plants Are At Risk As Russia Fighting Continues In Ukraine

Nuclear Power Plants : అణు రియాక్టర్లపై దాడులు వద్దు : 
యుద్ధకాలంలో యుక్రెయిన్‌లోని అణు రియాక్టర్లు ప్రమాదపు అంచున ఉన్నాయనేది రష్యా దాడులతో మరోసారి రుజువైంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు సైతం రష్యాకు అణు రియాక్టర్లపై దాడులు జరపవద్దని విజ్ఞప్తులు చేస్తున్నాయి. 1986లో చెర్నోబిల్‌ అణు విద్యుత్తు కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది.

యుక్రెయిన్‌ను రష్యా ఆధీనంలోకి తీసుకున్న వెంటనే భారీ ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని యుక్రెయిన్‌ ప్రకటించింది. చెర్నోబిల్‌లోని నాలుగు అణు రియాక్టర్లలో ఒక రియాక్టర్‌ పేలిపోయింది. దీని ప్రభావం యూరప్‌ అంతటా వ్యాపించింది. రేడియేషన్‌ కారణంగా చాలా మంది చనిపోయారు.

ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు రేడియేషన్‌ ప్రభావానికి గురవతూనే ఉన్నాయి. ప్రాణాంతక వ్యాధుల బారినపడ్డారు. ప్రపంచంలో జరిగిన అతి పెద్ద ప్రమాదాల్లో చెర్నోబిల్‌ ప్రాంతం ఒకటిగా ఉంది. ప్రమాదకర అణు కేంద్రాలపై దాడులు చేయొద్దని జెనీవా ఒప్పందంలో ఉండనే ఉంది. కానీ, రష్యా మాత్రం ఆ ఒప్పందాన్ని తుంగలో తుక్కేసి తన ఇష్టరాజ్యంగా దాడులకు తెగబడుతోంది.

యుక్రెయిన్‌ కన్నా ఎక్కువగానే అణు విద్యుత్తు కేంద్రాలు రష్యాలోనూ ఉన్నాయి. యుక్రెయిన్‌లో అణు రియాక్టర్లపై రష్యా దాడులు చేస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో పుతిన్ కు ముందే తెలుసునని నిపుణులు అంటున్నారు. యూరప్‌ దేశాలకూ అణుముప్పు పొంచి ఉందనే సంకేతాలను రష్యా ద్వారా తెలుస్తోందని హెచ్చరిస్తున్నారు.

Read Also : Ukraine Nuclear Plants : అణుయుద్ధం ప్రమాదపు అంచులో యుక్రెయిన్.. పేలితే భారీ వినాశనమే..!