ఇద్దరి ప్రాణాలు తీసిన లాఫీంగ్ గ్యాస్ !

  • Published By: madhu ,Published On : March 7, 2020 / 02:09 AM IST
ఇద్దరి ప్రాణాలు తీసిన లాఫీంగ్ గ్యాస్ !

లాఫింగ్ గ్యాస్ ఇద్దరు ప్రాణాలు తీసింది. ఉక్రెయిన్‌కు చెందిన చెస్ గ్రాండ్ మాస్టర్, ఆయన స్నేహితురాలు చనిపోయారు. మాస్కోలోని ఒక ప్లాట్‌లో వీరు విగతజీవులై కనిపించారు. లాఫింగ్ గ్యాస్ వల్లే ఇద్దరు ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. స్టానిస్ లావ్ బోగ్డానోవిచ్ (27), అలజ్గాండ్రా వెర్నిగోరా (18) మాస్కోలో నివాసం ఉంటున్నారు. బోగ్డా..స్పీడ్ చెస్ ఛాంపియన్. వెర్నిగోరా కూడా చెస్ క్రీడాకారిణి.

2013లో క్విక్ చెస్ చాంపియన్‌గా నిలిచాడు. ఇటీవలే చెస్ పోటీలు జరిగాయి. రష్యా తరపున బరిలో దిగారు. ఉక్రెయన్‌తో పోటీ పడి..విజేతగా నిలిచారు. వీరు నివాసం ఉంటున్న ప్లాట్‌లో లాఫింగ్ గ్యాస్ బెలూన్లు ఉన్నాయి. బెలూన్ సాయంతో గాలిని పీలుస్తుంటారు. అయితే..వీరు గాలి పీలుస్తూ..చనిపోయారు. వారి తలలు ప్లాస్టిక్ సంచుల్లో ఉన్నాయని, పక్కనే గ్యాస్ డబ్బా కూడా ఉంది. 
 

అసలు లాఫింగ్ గ్యాస్ అంటే ఏమిటీ ? 
లాఫింగ్ గ్యాస్..అంటే..నైట్రస్ ఆక్సైడ్‌ను శస్త్రచికిత్సలో మత్తుమందుగా ఉపయోగిస్తుంటారు. దీనిని పీల్చినప్పుడు ఊపిరితిత్తుల ద్వారా రక్తంలో కలుస్తుంది. మత్తుపదార్థాలైన ఎండార్ఫిన్లు, డోపామైన్‌ను విడుదల చేసేలా ప్రవర్తిస్తుంది. సంతోషకరమైన భావనలు కలిగి ఫుల్ ‌గా నవ్వాలని అనిపిస్తుంది. అందుకే దీనికి లాఫింగ్ గ్యాస్ అని పేరు వచ్చింది. 

Read More : రాహుల్‌కు కరోనా పరీక్షలు