Ukraine Crisis: యుక్రెయిన్ అంశంపై ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశం

యుక్రెయిన్, అమెరికా సహా మరో ఆరు దేశాలు ఈ సమావేశం నిర్వహించాలంటూ చేసిన విజ్ఞప్తిపై సభ్య దేశాలు మంగళవారం నాడు అత్యవసరంగా సమావేశం అయ్యాయి

Ukraine Crisis: యుక్రెయిన్ అంశంపై ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశం

Un

Ukraine Crisis: యుక్రెయిన్ – రష్యా ఉద్రిక్తల అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. యుక్రెయిన్, అమెరికా సహా మరో ఆరు దేశాలు ఈ సమావేశం నిర్వహించాలంటూ చేసిన విజ్ఞప్తిపై సభ్య దేశాలు మంగళవారం నాడు అత్యవసరంగా సమావేశం అయ్యాయి. ప్రస్తుతం “యూఎన్ రొటేటింగ్ కౌన్సిల్ ప్రెసిడెన్సీ”గా వ్యవహరిస్తున్న రష్యా ఈ సమావేశాన్ని రాత్రి 9 గంటలకు(న్యూయార్క్ కాలమానం ప్రకారం) షెడ్యూల్ చేసింది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కార్యాలయంలో ఈ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Also read: Ukraine Crisis: యుక్రెయిన్ నుంచి భారత్ కు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం

ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలైన యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, చైనా మరియు ఫ్రాన్స్ లతో పాటుగా రష్యాకు కూడా శాశ్వత సభ్యత్వం ఉంది. దీంతో భద్రతా మండలిలో ప్రవేశ పెట్టె బిల్లులకు అంగీకారం – తిరస్కారం తెలిపే హక్కుగా చెప్పబడే “వీటో పవర్” ఆయా సభ్యదేశాలకు ఉంటుంది. ఈక్రమంలో నేడు నిర్వహించిన అత్యవసర సమావేశంలో రష్యా ఎటువంటి ప్రకటన చేస్తుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్ మరియు డొనెట్స్క్ అనే రెండు ప్రావిన్సులను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్లు సోమవారం రష్యా ప్రకటించింది.

Also read; Russia-Ukraine : రష్యా-యుక్రెయిన్‌ సరిహద్దుల్లో యుద్ధ భయాలు

ఇక రష్యా యుక్రెయిన్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా యుక్రెయిన్ సరిహద్దులో నెలకొన్న పరిణామాలు ప్రపంచ శాంతికి తీవ్ర విఘాతాన్ని కలిగిస్తాయని ఆయన అన్నారు. అన్ని పక్షాలు శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. సమస్య ఏదైనా దౌత్య మార్గంలోనే పరిష్కారానికి కృషి చేయాలని భారత్ కోరుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ఇరుపక్షాలు వీలైనంత త్వరగా చర్యలు ప్రారంభించాలని అన్నారు. యుక్రెయిన్ లోని భారతీయ పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన టీఎస్ తిరుమూర్తి.. 20 వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు, పౌరులు ఉక్రెయిన్​లోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నారని వారి రక్షణే మాకు ప్రాధాన్యమని వివరించారు. ట్రైలేటరల్ కాంటాక్ట్ గ్రూప్ ద్వారా ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న దేశాల ప్రయత్నాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని.. రష్యా యుక్రెయిన్ మధ్య సైనిక ఘర్షణలు మరింత తీవ్రం కాకుండా చూడాలని భారత్ తరుపున సందేశాన్ని వినిపించారు.