Russia vs Ukraine war: పుతిన్‌కు భారీషాక్.. ఇంటబయట తప్పని కష్టాలు.. అధికారం కాల్పోవటం ఖాయమా?

యుక్రెయిన్ పై అలుపెరగని పోరాటం సాగిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ కు భారీ షాక్ తగిలింది. ఫలితంగా ఇంట, బటయ ఎదురవుతున్న కష్టాలతో ఆయన అధికార పీఠాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్న వాదన తెరపైకి వచ్చింది. యుక్రెన్ పై మూడు నెలలుగా రష్యా సైన్యం దాడులకు పాల్పడుతుంది..

Russia vs Ukraine war: పుతిన్‌కు భారీషాక్.. ఇంటబయట తప్పని కష్టాలు.. అధికారం కాల్పోవటం ఖాయమా?

Putin

Russia vs Ukraine war: యుక్రెయిన్ పై అలుపెరగని పోరాటం సాగిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ కు భారీ షాక్ తగిలింది. ఫలితంగా ఇంట, బటయ ఎదురవుతున్న కష్టాలతో ఆయన అధికార పీఠాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్న వాదన తెరపైకి వచ్చింది. యుక్రెన్ పై మూడు నెలలుగా రష్యా సైన్యం దాడులకు పాల్పడుతుంది. ఇప్పటికే యుక్రెయిన్ లోని సగానికిపైగా ప్రాంతాలు రష్యా సైన్యం చేతుల్లోకి వచ్చాయి. పూర్తిస్థాయిలో యుక్రెయిన్ ను హస్తగతం చేసుకొనేవరకు యుద్ధాన్ని విరమించేందుకు పుతిన్ ఆసక్తిచూపడం లేదని తెలుస్తోంది. అయితే పుతిన్ చర్యలను అమెరికాతో పాటు అనేత దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దాదాపు డజనుకుపైగా దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. తాజాగా యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

Russia Ukraine War: రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇప్పుడేం జరుగుతుంది

రష్యా నుంచి చమురు దిగుమతులను వచ్చే ఆరు నెలల్లో ఏకంగా 90శాతం తగ్గించేందుకే యూరప్ దేశాలన్నీ అంగీకరించాయి. ఈ నిర్ణయంతో రష్యా నుంచి సముద్ర మార్గాన జరిగే యూరప్ కు ఇంధన సరఫరా పూర్తిగా నిలిపోనుంది. ఇప్పటికే యుక్రెయిన్‌లో రష్యా ఆక్రమణ, దాడులు కొనసాగుతున్న వేళ రష్యా పొరుగు దేశాలైన ఫిన్లాండ్‌, స్వీడన్‌లు సైతం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో చేరేందుకు సిద్ధమయ్యాయి. ఆ దేశాలు నాటోలో చేరితే రష్యాకు రక్షణపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. మరోవైపు డెన్మార్క్ కు మంగళవారం నుంచి చమురు సరఫరాలు ఆపేస్తున్నట్లు రష్యా ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం గజ్ ప్రోమ్ ప్రకటించింది. తమ పట్ల విద్వేషమే ఏకైక ఫ్రాతిపదికగా ఈయూ ఈ నిర్ణయం తీసుకుందని రష్యా మాజీ అధ్యక్షుడు అన్నారు. అయితే ఇప్పటికే బల్గేరియా, పోలాంట్, ఫిన్లాండ్ లకు చమురు ఎగుమతులను రష్యా నిలిపివేసిన విషయం విధితమే.

Russia ukraine war : ఎన్నాళ్లీ మారణకాండ..యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ముగిసేది ఎప్పుడు?

ఇప్పటికే బయట దేశాల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు, ఒత్తిడితో రష్యా అధ్యక్షుడు పుతిన్ సతమతమవుతున్నాడు. తాజాగా స్వదేశంలోనూ పుతిన్ పై వ్యతిరేఖత వ్యక్తమవుతున్నట్లు కనిపిస్తోంది. త్వరలో ఆయన అధికార పీఠానికిసైతం దూరం కావాల్సి వస్తుందన్న చర్చ జరుగుతుంది. రష్యా మాజీ అధ్యక్షుడు బోరిస్ ఎల్త్సిన్‌ అల్లుడు వాలెంటిన్‌ యుమషేవ్‌ పుతిన్‌ సలహాదారు పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన ఎల్త్సిన్‌ హయాం నుంచీ అధ్యక్ష సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. రష్యాలో పాలనపై ఆయన గట్టిపట్టుంది. యుమషేవ్ కూతురు రష్యా సైన్యం యుక్రెయిన్ పై సాగిస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇటీల ఆమె రష్యా కు వ్యతిరేకంగా ట్విటర్ లో పోస్టు సైతం చేశారు. ఈ క్రమంలో యమషేవ్ తన బాధ్యతల నుంచి తప్పుకోవటంతో పుతిన్ కు ఇబ్బందులు తప్పవన్న చర్చ జరుగుతుంది. పుతిన్ అధికారానికి బీటలు పడుతాయని, సైన్యం మీదా ఆయన పట్టుకోల్పోయే ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.