Unrest in Sweden: స్వీడన్ లోనూ మత ఘర్షణలు: ఖురాన్‌ను తగలబెట్టాలని పిలుపునిచ్చిన రాజకీయ పార్టీ

"ఖురాన్ ను తగలబెట్టండి, దానిపై పంది రక్తం పోయండి" అంటూ రాస్మస్ పలుడాన్ చేసిన వ్యాఖ్యలపై స్వీడన్ లోని కొందరు ముస్లింలు నిరసనకు దిగారు

Unrest in Sweden: స్వీడన్ లోనూ మత ఘర్షణలు: ఖురాన్‌ను తగలబెట్టాలని పిలుపునిచ్చిన రాజకీయ పార్టీ

Rasmus

Unrest in Sweden: స్కాండినేవియా దేశం స్వీడన్లో అశాంతియుత వాతావరణం నెలకొంది. గతంలో ప్రశాంతతకు మారుపేరుగా చెప్పుకున్న ఈదేశం..ప్రస్తుతం మతపరమైన అల్లర్లతో అట్టుడుకుతోంది. ముస్లింలు పవిత్రంగా భావించే ఖురాన్ ను తగలబెట్టి, దానిపై “పంది రక్తం” పోయాలంటూ స్వీడన్ కు చెందిన ఫార్-రైట్ రాజకీయ పార్టీ “స్ట్రామ్ కుర్స్” ఇటీవల దేశ వ్యాప్త పిలుపునిచ్చింది. స్ట్రామ్ కుర్స్ పార్టీ వ్యవస్థాపకుడు, డానిష్ న్యాయవాది రాస్మస్ పలుడాన్..ముస్లింలకు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. స్వీడన్ లో ఖురాన్ను నిషేధించి..ముస్లింలకు వ్యతిరేకంగా దేశ ప్రజలు నిరసన తెలపాలంటూ రాస్మస్ పలుడాన్ ఇచ్చిన పిలుపు గత కొన్ని రోజులుగా స్వీడన్ లో అల్లర్లకు దారితీసింది. రాస్మస్ పిలుపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..కొందరు నిరసనకు దిగారు. రాస్మస్ పలుడాన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్వీడన్ లోని లాండ్స్క్రోనా పట్టణంలో నిర్వహించిన ముస్లిం వ్యతిరేక ప్రదర్శనలో నిరసనకారులు చొరబడి రాళ్ళు విసిరి, కార్లు, టైర్లు మరియు చెత్త డబ్బాలకు నిప్పంటించారు.

Also read:Jahangirpuri violence : జహంగీర్‌పురి హింసాకాండలో 22మంది అరెస్ట్.. పుష్ప స్టైల్‌లో కోర్టుకు నిందితుడు..

ఈఘటనలో పాలూడాన్ కాలికి రాయి తగలడంతో అతను తీవ్రంగా గాయపడ్డారు. మరో ముగ్గురు స్వీడన్ పౌరులు గాయపడ్డారు. దీంతో ముస్లిం వ్యతిరేక ప్రదర్శన వేదికను మాల్మో నగరానికి మార్చారు నిర్వాహకులు. ఇదిలాఉంటే ముస్లిం వ్యతిరేక ప్రదర్శనలతో దేశం అట్టుడికిపోతున్నా..ఆ ప్రదర్శనల అనుమతులను ఉపసంహరించుకోబోమని ప్రభుత్వం ప్రకటించింది. “ఎందుకంటే వారు భావ ప్రకటనా స్వేచ్ఛను నిరాకరించే పరిమితిని ఉల్లంఘించలేదని “దక్షిణ స్వీడన్లోని పోలీసు ప్రతినిధి కిమ్ హిల్డ్ తెలిపారు. నిరసనకారుల హక్కుగా భావించే “ప్రదర్శనలు, భావప్రకటన స్వేచ్ఛను” అడ్డుకోవాలంటే అందుకు ప్రభుత్వ పరంగా నిబంధనలు వర్తించవని ఆయన అన్నారు.

Also read:China India Border: చైనా బరితెగింపు: ఎల్ఏసీ వెంట మొబైల్ టవర్ల ఏర్పాటు

“ఖురాన్ ను తగలబెట్టండి, దానిపై పంది రక్తం పోయండి” అంటూ రాస్మస్ పలుడాన్ చేసిన వ్యాఖ్యలపై స్వీడన్ లోని కొందరు ముస్లింలు నిరసనకు దిగారు. సుమారు 100 మంది నిరసనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్ సహా ఇతర పట్టణాలు మరియు నగరాలలో ఇలాంటి నిరసనలు సంభవించాయి. మరోవైపు ఖురాన్ను తగలబెట్టాలన్న స్ట్రామ్ కుర్స్ పార్టీ అధినేత రాస్మస్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఇరాక్ లోని స్వీడన్ దేశ దౌత్యాధికారిని ఆదేశించింది.

Also read:India Poverty : భారత్‌లో భారీగా తగ్గిన పేదరికం.. 10శాతం పెరిగిన రైతుల ఆదాయం-వరల్డ్ బ్యాంక్