Donald Trump : ట్రంప్‌ను చంపుతానన్న వ్యక్తి అరెస్టు..గృహనిర్బంధం చేసి..జీపీఎస్‌ తో మానిటరింగ్ చేయాలని కోర్టు ఆదేశం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కిడ్నాప్‌ చేసి చంపేస్తానని చంపేస్తానంటూ బెదిరించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Donald Trump : ట్రంప్‌ను చంపుతానన్న వ్యక్తి అరెస్టు..గృహనిర్బంధం చేసి..జీపీఎస్‌ తో మానిటరింగ్ చేయాలని కోర్టు ఆదేశం

Us Secret Service Arrested He Wanted To Kill Donald Trump

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కిడ్నాప్‌ చేసి చంపేస్తానని చంపేస్తానంటూ బెదిరించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయి పదవినుంచి తప్పుకోనని అంటున్న ట్రంప్ ను కిడ్నాప్ చేసి మరీ చంపేస్తానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన 72 ఏళ్ల థామస్ వెల్నిక్ ను న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ 72 ఏళ్ల థామస్ వెల్నిక్‌ని న్యూయార్క్‌లో అరెస్టు చేసింది.

అమెరికాలో 2020లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ ఓడిపోయారు. బైడన్ ప్రెసిడెంట్ అయ్యారు. ఈ క్రమంలో ట్రంప్ జో బైడెన్ ఎన్నికను తాను అంగీకరించబోనని.. ఈ విషయంలో తన పోరాటం కొనసాగుతుందని అనేకసార్లు ప్రకటించారు ట్రంప్. దీంతో థామస్ 2020 ఎన్నికలలో ఓడిపోయి పదవీ విరమణ చేయడానికి ట్రంప్ నిరాకరిస్తే గనుక ట్రంప్ ను కిడ్నాప్‌ చేసి చంపేస్తానని 72 ఏళ్ల థామస్ యూస్‌ కాపిటల్‌ పోలీసులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

Read more : Afghanistan: పాకిస్థాన్-అఫ్ఘానిస్థాన్ బోర్డర్ లో స్కూలు వద్ద పేలిన బాంబు..9మంది చిన్నారుల మృతి!

అంతేకాదు థామస్ 2020 జనవరిలో న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లోని సీక్రెట్ సర్వీస్ ఆఫీసుకు రెండు వాయిస్ మెయిల్ మెసేజ్ లు పంపాడనే ఆరోపణలు ఉన్నాయి. గత నవంబర్‌ లో కూడా న్యూయార్క్ లోని సీక్రెట్ సర్వీస్ డెస్క్‌కి తన సెల్ ఫోన్ నుండి మూడుసార్లు పోన్ చేశాడని..ఫోన్ చేసినప్పుడల్లా తన పేరును ప్రత్యేకించి చెబుతుండేవాడని అధికారులు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే పబ్లిసిటీ కోసం అతను ఇలా చేశాడా?అనే అనుమానాలు వస్తున్నాయి. అలా పదే పదే ట్రంప్ ను చంపేస్తానని చెబుతుండటంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా..కోర్ట్‌ సోమవారం (జనవరి 10,2022)ఈ కేసును విచారించింది.

Read more : Gold Seized : బ్యాండేజీల్లో దాచుకుని బంగారం అక్రమ తరలింపు

థామస్ వెల్నిక్‌ కావాలని ట్రంప్ ను చంపుతానని బెదిరించాడని..వెల్నిక్‌ వద్ద 22 క్యాలిబర్ తుపాకీ కూడా ఉందని ఫెడర్‌ కోర్టు జడ్జి బ్రూక్లిన్‌ పేర్కొన్నారు. దీంతో వెల్నిక్‌కి రూ 3 లక్షల పూచికత్తుతో షరతులతో కూడిన బెయిల్‌ని ఫెడరల్‌ కోర్టు మంజూరు చేసింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని షరతులు విధిస్తు వెల్నిక్ రాత్రి సమయాన్ని గృహనిర్బంధం చేయాలని..అతనికి జీపీఎస్‌ మానిటరింగ్ పరికరాన్ని అమర్చాలని జడ్జి పోలీసులకు ఆదేశించారు. అతని మానసిక పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని..అతను మద్యం,మాదకద్రవ్యాలకు బానిసగా మారి ఉన్నట్లైతే చికిత్స తీసుకోవాలని సూచించారు.