US B-21 Stealth Bomber : ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టించే అత్యాధునిక B-21 బాంబర్‌ను ఆవిష్కరించిన అమెరికా

చైనా, రష్యా సహా ప్రపంచ దేశాల వెన్నులో వణుకుపుట్టేలా మోస్ట్ అడ్వాన్స్‌డ్ మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్‌ను అమెరికా సమకూర్చుకుంది. దీని పేరే బీ 21- రైడర్. అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు ఆ దేశం అభివృద్ధి చేసిన అన్ని బాంబర్ విమానాల కంటే ఇది అత్యాధునికమైనది..అత్యంత శక్తివంతమైంది. బీ 21 రైడర్.. న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్. సిక్త్‌ జనరేషన్ మిలటరీ న్యూక్లియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ బీ 21 రైడర్‌ను కాలిఫోర్నియాలోనూ వైమానిక స్థావరంలో ఆవిష్కరించారు.

US B-21 Stealth Bomber : ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టించే అత్యాధునిక B-21 బాంబర్‌ను ఆవిష్కరించిన అమెరికా

US B-21 Stealth Bomber

US B-21 stealth bomber : ప్రపంచంలోని ఏ మూలకైనా వాయువేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఆ బాంబర్ సొంతం .ఏ దేశ రక్షణ వ్యవస్థనైనా చేధించగల నైపుణ్యం గల సత్తా..అణు బాంబులతో విరుచుకుపడి దేశాలకు దేశాలను నామరూపాలు లేకుండా చేయగల ధీరత్వం.. ఇలా ఒక్కటేంటి.. అది రంగంలోకి దిగిందంటే…యుద్ధక్షేత్రంలో అవతలి దేశం ప్రపంచపటం నుంచి మాయమైనట్టే…అసలు యుద్ధానికి ఎందుకు దిగామా అని వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న మిలటరీ ఆయుధాలు ఒక ఎత్తు..ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఆయుధం మరో ఎత్తు. చైనా, రష్యా సహా ప్రపంచ దేశాల వెన్నులో వణుకుపుట్టేలా మోస్ట్ అడ్వాన్స్‌డ్ మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్‌ను అమెరికా సమకూర్చుకుంది. దీని పేరే బీ 21- రైడర్. అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు ఆ దేశం అభివృద్ధి చేసిన అన్ని బాంబర్ విమానాల కంటే ఇది అత్యాధునికమైనది..అత్యంత శక్తివంతమైంది. బీ 21 రైడర్.. న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్. సిక్త్‌ జనరేషన్ మిలటరీ న్యూక్లియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ బీ 21 రైడర్‌ను కాలిఫోర్నియాలోనూ వైమానిక స్థావరంలో ఆవిష్కరించారు.

బీ 21 రైడర్ ఇతర దేశాల రాడార్ వ్యవస్థల కళ్లుకప్పి డేగలాగా దూసుకుపోతుంది. తమ పరిధిలోకి వచ్చాయని శత్రు దేశాల రాడార్లు కనిపెట్టేలోపే… బీ 21 రైడర్.. ఆ దేశంపై అణుదాడి చేసి వెళ్లిపోతుంది. ఇప్పటి వరకు అమెరికా బీ 2 స్పిరిట్ బాంబర్ విమానాలను ఉపయోగిస్తుంది. వీటితో పోల్చితే బీ 21 రైడర్ బాంబర్ అత్యాధునికమైంది. ప్రస్తుతానికి ఆరు బీ 21 రైడర్ న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్లను రెడీ చేస్తున్న అమెరికా.. వీటి సంఖ్యను 100కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీ 21 రైడర్ ఒక్కో విమానాన్ని తయారు చేయడానికి 6132 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. గడిచిన మూడు దశాబ్దాల్లో అమెరికా ఈ స్థాయి స్టెల్త్ రాడార్‌ను సమకూర్చుకోవడం ఇదే తొలిసారి.

అమెరికా వాయుసేన పరిధిలో ఉన్న బాంబర్ ఫ్లీట్ మొత్తాన్ని ఈ బీ 21 రైడర్ గైడ్ చేస్తుంది. సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం, సమాచారాన్ని పంపించడం, ఎక్కడ కావాలంటే అక్కడ దాడులు చేయడం.. ఈ అన్ని పనులు బీ 21 ఎలాంటి పొరపాటు లేకుండా పూర్తి చేయగలదు.ఓవైపు రష్యా యుక్రెయిన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం సాగుతుంటే.. మరోవైపు చైనాఅమెరికా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ముదురుతోంది ఇక యుక్రెయిన్ విషయంలో రష్యా అమెరికా మధ్య కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో చైనా,రష్యా సహా తమతో పెట్టుకునే ఏదేశానికైనా గట్టి సమాధానం ఇచ్చేలా బీ 21 రైడర్‌ను రంగంలోకి దింపుతోంది అమెరికా.