కారుతో హంగామా చేసిన 14 ఏళ్ల కొడుకుని నడిరోడ్డుపైకి గెంటేసిన తల్లిదండ్రులు!

  • Published By: nagamani ,Published On : August 11, 2020 / 12:26 PM IST
కారుతో హంగామా చేసిన 14 ఏళ్ల కొడుకుని నడిరోడ్డుపైకి గెంటేసిన తల్లిదండ్రులు!

పక్కింటిలో ఉండే పిల్లలు ఎంత అల్లరి చేసినా..తుంటరిపనులు చేసినా..మనకు ఎంత ఇబ్బంది కలిగించినా భరించాల్సిందే మన దేశంలో అయితే. కానీ అదే అమెరికాలో ఇటువంటిదే అయితే..మా హక్కులకు భంగం కలిగిందని నైబర్స్ ఊరుకోరు..కేసు కూడా పెడతారు..అది చిన్నపిల్లలైనా సరే సహించరు. అదే జరిగింది అమెరికాలో.



తమ 14 ఏళ్ల కొడుకు పక్కింటివాళ్లకు ఇబ్బంది కలిగే ప్రవర్తించినందుకు ఆ బాలుడి తల్లిదండ్రులు అతనికి ఓవింత శిక్ష వేశారు. కొన్ని రోజుల పాటు నువ్వు రోడ్డు పక్కనే ఉండాలి..ఇంట్లోకి రావద్దని ఖరాఖండిగా చెప్పేశారు. అతడి బెడ్ సహా ఆ పిల్లాడి వస్తువులన్నీ రోడ్డు పక్కకు షిఫ్ట్ చేశారు. ఇంతకీ అతను చేసిన పనేంటంటే..

అమెరికాలోని ఆరిజోనాలో నివసించే ఏంజెల్ మార్టినెజ్ అనే 14 ఏళ్ల పిల్లాడు అమ్మానాన్నలు ఇంట్లో లేని సమయం చూసి పార్కింగ్ లో పెట్టిన కారు బైటకు తీసి దాంతో విన్యాసాలు చేశాడు. వాడు కారుతో చేసే ఫీట్లకు..కొట్టే హారన్ లకు మార్టినెజ్ జోరుతో పక్కనే ఉన్న ఇంటివారు భయపడ్డారు..ఎంతో ఇబ్బందిపడ్డారు. అమెరికా వారు కదా..పిల్లాడే కదాని లైట్ తీసుకోలేదు. పోలీసులు ఫోన్ చేశారు.



దాన్ని పోలీసులు కూడా లైట్ తీసుకోలేదు..ఎందుకంటే అది అమెరికా. మార్టినెజ్ ను అదుపులోకి తీసుకుని అతని పేరెంట్స్ కు సమాచారం ఇచ్చారు. దీంతో పిల్లాడి జీవితం నాశనం అయిపోతుంది పోలీసు కేసు నమోదు అయితే అని.. మార్టినెజ్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల కాళ్లా వేళా పడి మరోసారి ఇలా జరక్కుండా చూసుకుంటామని బలిమాలుకుని ఎలాగైతేనే తమ కొడుకును విడిపించుకుని ఇంటికి తీసుకొచ్చారు.

మరోసారి అలా జరక్కూడదంటే..పిల్లాడికి భయం అంటే ఏంటో..ఇబ్బంది అంటే ఏంటీ తెలియాలని..చేసిన తప్పుకు శిక్ష విధించాలని అతడ్ని రోడ్డు పక్కనే ఉండాలని..అతని బెడ్ తో సహా వస్తువులన్నీ రోడ్డు పక్కకు ఫిఫ్ట్ చేశారు. అంతేకాదు అక్కడ ఓ బోర్డు కూడా పెట్టి..
ఆ బోర్డు పై… “నా తల్లిదండ్రుల కారును దొంగిలించాను. వారి పర్మిషన్ లేకుండా కారు తీసుకోవడమే కాకుండా వేగంగా నడిపాను. నన్ను క్షమించండి” అని రాసిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో..ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



హా…అన్నట్లు..అదే మన ఇండియాలో అయితే..(భారత్ ను తక్కువ చేయాలని కాదు) మైనార్టీ తీరనివారు…డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని వాళ్లు సైతం ఇష్టారాజ్యంగా బైకులు నడపొచ్చు..కార్లు కూడా నడపొచ్చు..అంతేకాదు..బైక్ రేసులు..కారు రేసులు కూడా చేసేయొచ్చు..అయినా సరే ఇక్కడ శిక్షలే కాదు కనీసం చర్యలు కూడా ఉండవు.