Titan Sub Derbis Found: టైటాన్ శిథిలాల నుండి బిలియనీర్స్ మృతదేహాలు స్వాధీనం చేసుకున్న యూఎస్ కోస్ట్ గార్డ్

టైటానిక్ సముద్రయానంలో పేలిన సబ్ మెర్సిబుల్ టైటాన్ శిథిలాల నుండి మానవ మృతదేహాల అవశేషాలను స్వాధీనం చేసుకున్నట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ బుధవారం నివేదించింది.

Titan Sub Derbis Found: టైటాన్ శిథిలాల నుండి బిలియనీర్స్ మృతదేహాలు స్వాధీనం చేసుకున్న యూఎస్ కోస్ట్ గార్డ్

US Coast Guard

Updated On : June 29, 2023 / 9:22 AM IST

Titan Sub Derbis: టైటానిక్ శిథిలాలను చూడటానికి ప్రపంచంలోని ఐదుగురు బిలియనీర్లు జూన్ 18న జలాంతర్గామిలో సముద్రంలోకి వెళ్లిన విషయం విధితమే. అయితే వారు సముద్రంలో దిగిన రెండు గంటలకే వారి కనెక్షన్ తెగిపోయింది. దానిని కనుగొనడానికి అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్ కోస్ట్‌గార్డ్స్ వెతుకులాట ప్రారంభించారు. జూన్ 22న జలాంతర్గామి పేలిపోయి అందులో ఉన్న ఐదుగురు మరణించినట్లు ప్రకటించారు. మరోవైపు టైటాన్ జలాంతర్గామి శిథిలాల నుండి బిలియనీర్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ వర్గాలు తెలియజేశాయి.

Titan Submersible: టైటాన్ సబ్‌మెర్సిబుల్ పేలుడుకు కారణం.. కెటాస్ట్రోపిక్ ఇంప్లోషన్ అంటే ఏమిటి?

యూఎస్ కోస్ట్ గార్డ్ టైటాన్ సబ్‌మెర్సిబుల్ శిథిలాలను బుధవారం భూమికి తీసుకువచ్చారు. సముద్రగర్భం నుంచి శిథిలాలు, ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. ఈ శిథిలాల్లో మృతదేహాలుకూడా ఉన్నాయి. ముఖ్యమైన సాక్ష్యాలను తిరిగి పొందడంలో అంతర్జాతీయ, అంతర్- ఏజెన్సీ మద్దతుకు నేనే కృతజ్ఞుడను అని యూఎస్ కోస్ట్ గార్డ్ చీఫ్ కెప్టెన్ జాసన్ న్యూబౌర్ ఒక ప్రకటనలో తెలిపారు. శిథిలాల రూపంలో లభించిన సాక్ష్యం అంతర్జాతీయ పరిశోధకులకు వివిధ సమాచారాన్ని పొందేందుకు సహాయపడుతుందని చెప్పారు. రాబోయేకాలంలో అనేక కారణాలను అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా ఇలాంటి సాక్ష్యాధారాల వల్ల మరోసారి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసేందుకు ఉపకరిస్తుందని తెలిపారు.

Titan Submersible destroyed: టైటానిక్ సబ్‌మెర్సిబుల్ పేలుడును రికార్డ్ చేసిన యూఎస్ నేవీ

టైటాన్ శిథిలాలు సముద్రపు అడుగు భాగంలో 12,500 అడుగుల (3,810 మీటర్లు) నీటిలో, 1,600 అడుగుల (488 మీటర్లు) లోతులో ఉన్నాయని కోస్ట్ గార్డ్ గతవారం తెలిపింది. మరోవైపు కోస్ట్ గార్డ్ పేలుడుపై దర్యాప్తు చేయడానికి మెరైన్ బోర్డ్ ఆఫ్ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు బిలియనీర్స్ మృతదేహాలు గుర్తుపట్టలేనివిగా మారిపోయాయి. శరీర భాగాలు చిందరవందర అయినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది.