Flesh Eating Bacteria : మనిషి మాంసం తినేసే బ్యాక్టీరియా .. ప్రతీ ఏటా పలువురు మృతి

శరీరంలో మాంసాన్ని తినేసే బ్యాక్టీరియా. ప్రతీ ఏడాది దాదాపు 80,000మంది ఈ ఇన్ ఫెక్షన్ బారిన పడుతున్నారు. వారిలో చాలామంది చనిపోయారు.

Flesh Eating Bacteria : మనిషి మాంసం తినేసే బ్యాక్టీరియా .. ప్రతీ ఏటా పలువురు మృతి

Flesh Eating Bacteria

Eating Bacteria Vibrio vulnificus In US : అమెరికాలో ఓ బ్యాక్టీరియా బారినపడినవారు మరణిస్తున్నారు. మానవ శరీర మాంసాన్ని తినేసే బాక్టీరియా సోకి మనుషులు చనిపోతున్నారు. ఇటువంటి కేసులు అమెరికాలో వేగంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు హడలిపోతున్నారు. ఈ ప్రమాదకరమైన బ్యాక్టీరియా గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (Centers for Disease Control) (CDC) హెచ్చరికలు చేసింది. విబ్రియో వల్నిఫికస్‌ (Vibrio vulnificus) అనే బ్యాక్టీరియా గాయాల ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించి.. క్రమంగా చర్మరాన్ని, కండరాలను తినేస్తోంది. అందేకాదు కండరాలు, రక్తనాళాలను కూడా తినేస్తోంది. ఈ బ్యాక్టీరియా బారిన పడి ఇప్నపటికే దాదాపు 12మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ బ్యాక్టీరియా సోకితే పొత్తుకడుపు అంతా తిమ్మిరిగా ఉంటుందని, వికారంతో వాంతులు అవుతాయని నిపుపులు సూచిస్తున్నారు.  చలి జ్వరం వస్తుందని ఇటువంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదంచాలని సూచించారు.

అమెరికాలో ప్రతీ ఏటా ఈ బ్యాక్టీరియా బారిన పడి డజన్ల కొద్దీ దీని వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతీ సంవత్సరం దాదాపు 80,000మందికి పైగా విబ్రియో ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారని తెలుస్తోంది. వారిలో సంవత్సరానికి 100మంది వరకు మరణించారు. ఈ పచ్చి మాసం, లేదా పచ్చి నత్తగుల్లలు, షెల్‌ఫిష్‌లు తినడం ద్వారా ఈ బ్యాక్టీరియా బారినపడతారని నిపుణులు తెలిపారు. అలాగే శరీరంపై గాయాలు ఉన్నవారు నీటిలో దిగితే కూడా ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుందని నదులు, సముద్రాలు వంటి వాటిలో దిగితే శరీరంపై ఉండే గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందని తెలిపారు.

Spooky Golden Egg : మహాసముద్రంలో కనిపించిన ‘బంగారు గుడ్డు’ .. ఆ జీవి కోసం సముద్రాన్ని జల్లెడపడుతున్న శాస్త్రవేత్తలు

సీడీసీ (CDC) అంచనా ప్రకారం.. 2023లో అమెరికాలో దాదాపు డజను మంది ఈ బ్యాక్టీరియా కారణంగా చనిపోయారు. అంతేకాదు ప్రతీ ఏడాది దాదాపు 80,000మంది ఈ ఇన్ ఫెక్షన్ బారిన పడుతున్నారు.వారిలో దాదాపు 100మంది చనిపోతున్నట్టు తెలిసింది. కాబట్టి ఈ బ్యాక్టీరియా విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆహారంలో ఉడికించని షెల్‌ఫిష్‌లను తీసుకోవద్దని సీడీసీ హెచ్చరించింది. ఒకవేళ తినాల్సి వస్తే బాగా శుభ్రం చేసి ఉడికించి తినాలని సూచించింది. అలాగే శరీరంపై గాయాలున్న వారు ఉప్పునీరు, బ్రాకిష్‌ వాటర్‌కు దూరంగా ఉండాలని వెల్లడించింది. ఒకవేళ అటువంటి నీటిలో దిగితే తరువాత శుభ్రమైన నీటితో స్నానం చేయాలని సూచించింది.

ఈ బ్యాక్టీరియా గురించి ఫ్లోరిడాలోని అట్లాంటిక్ యూనివర్శిటీ ఓషనోగ్రఫీ ఇన్ స్టిట్యూట్ ఇన్ఫోర్ట్ పైరస్ (Florida Atlantic University Harbor Branch Oceanographic Institute) సైంటిస్ట్ గ్యాబా బార్బరైట్ (researcher Gabby Barbarite )మాట్లాడుతు..వెచ్చగా ఉండే నీటిలో బ్యాక్టీరియా పునరుత్పత్తి వేగంగా జరుగుతుందని తెలిపారు. దీని గురించి నేచర్‌ పోర్ట్‌ఫోలియో జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. 1988-2018 మధ్య 3దశాబ్దాల్లో ఈ ఇన్‌ఫెక్షన్ల రేటు 8 రెట్లు పెరిగిందని వెల్లడించింది. గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో( Gulf of Mexico )లో ఎక్కువ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. శరీరానికి గాయం అయితే ఆ గాయం చుట్టు ఉన్న చర్మం, కండరం, నరాలు, కొవ్వు, రక్తకణాలను ఈ బ్యాక్టీరియా తినేస్తుందని కాబట్టి ఈ ప్రాణాంతకమైన బ్యాక్టీరియాతో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Most Expensive Coffee : పిల్లుల మలంతో చేసే కాఫీ .. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టేస్టీ కాఫీ

ఈ ఏడాది వేసవి కాలంలో అమెరికా తూర్పు తీరంలో ఆరుగురు ఈ బ్యాక్టీరియా వల్ల చనిపోయారు. జులైలో కనెక్టికట్‌లో ఇద్దరు, న్యూయార్క్‌లో ఒకరు చనిపోగా..గత ఆగస్టులో ఉత్తర కరోలినాలో ముగ్గురు చనిపోయారు. గల్ఫ్ మెక్సికో రాష్ట్రాల్లో ఈ బ్యాక్టీరియా కారణంగా మరణాలు ఎక్కువగా నమోదు అవతుంటాయి. కానీ విబ్రియో వల్నిఫికస్‌ మరణాలు అరుదుగా చోటుచేసుకునే తూర్పు రాష్ట్రాల్లో పెరగడం ఆందోళన కలిగిస్తోంది.