4 నెలల పసిపాపని ఊపిరి ఆడకుండా చేసి..చంపేసిన పెంపుడు కుక్క

4 నెలల పసిపాపని ఊపిరి ఆడకుండా చేసి..చంపేసిన పెంపుడు కుక్క

US pet dog has killed four month old baby girl : ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క ఆ ఇంటి ముద్దు బిడ్డనే చంపేసింది. దానికి తెలిసి చేసినా.. తెలియక చేసినా ఆ కుటుంబంలో బోసినవ్వుల్ని దూరం చేసి వారికి తీరని శోకాన్ని మిగిల్చింది. నాలుగు నెలల వయస్సున్న పసిబిడ్డపై కూర్చొన్న ఆ కుక్క ఊపిరి ఆడకుండా చేసింది. అంత బరువైన కుక్క మీద కూర్చొవడంతో ఊపిరి అందక ఆ చిన్నారి విలవిలలాడి చివరికి ప్రాణం వదిలిన ఈ దారుణమైన ఘటన గత గురువారం రాత్రి (డిసెంబర్ 31,2020) 7 గంటల సమయంలో అమెరికాలోని ఓహియో.. డైటాన్​లో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ పాప తండ్రి రేలిన్ హారిసన్ తెలిపారు. నూతన సంవత్సరంలో మా ఇంట తీవ్ర విషాదం నిండిందని తెలిపారు.

మా పెంపుడు కుక్క ఇంటిలో చాలా ఫ్రీగా తిరిగేది. అలా తిరుగతు తిరుగుతూ ఆ ఇంటి నాలుగు నెలల పసిబిడ్డమీద కూర్చోవటంతో పాపకు ఊపిరి ఆడక చనిపోయిందని ఆ తండ్రి కన్నీరు మున్నీరుగా వినపిస్తూ తెలిపారు. పాపను అలా చూసిన వెంటనే 911 ఎమర్జెన్సీ నంబర్​కు కాల్ చేశామని కానీ అప్పటికే పాప చనిపోయిందని డాక్టర్లు తెలిపారని చెప్పుకొచ్చారు రేలిన్ హారిసన్.

రాత్రి సమయంలో నిద్రలో మెలకువ వచ్చి చూసిన తనకు తమ పెంపుడు కుక్క తన చిన్నారి కూతురిపై కూర్చోవడంతో ఆమెకు ఊపిరి ఆడలేదని చెప్పాడు. నిద్రలో నుంచి తేరుకునే లోపే నష్టం జరిపిపోయందని ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే ఎమర్జెన్సీకి కాల్ చేయగా వచ్చిన డాక్టర్లు అప్పటికే పాప మృతి చెందిందని ధృవీకరించారని తెలిపారు.

కాగా రేలిన్ హారిసన్ పెంపుడు కుక్క చాలా పెద్దగా ఉంటుందని స్థానికురాలు లోనా డీపియర్ అన్నారు. అది రేలిన్ ఇంట్లో స్వేచ్ఛగానే తిరుగేదని కానీ వారి పాప చావుకు కారణమవుతుందని అనుకోలేదని బాధగా చెప్పారు. పెంపుడు జంతువులను కంట్రోల్ చేయకుండా అలా వదిలేస్తే..ఇలాంటి దారుణాలు జరిగే అవకాశం కూడా ఉంటుందని కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని సూచిస్తూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పాప మృతిపై డేటన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇప్పటికే పోస్టు మార్టం నిర్వహించారు. కాగా అనుకోకుండా దుర్ఘటన జరగడంతో పాప అంత్యక్రియల కోసం గో ఫౌండ్​మీ సంస్థ విరాళాలు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఇప్పటికే 15వేల డాలర్లకు పైగా డొనేషన్లు వచ్చాయి.