Joe Biden Corona : అమెరికా అధ్యక్షులు జో బైడెన్ కు మరోసారి కరోనా..వైరస్‌ నుంచి కోలుకున్న 3 రోజులకే

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డారు. వైరస్‌ నుంచి కోలుకున్న మూడు రోజుల్లోనే బైడెన్‌కు మళ్లీ పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన ప్రస్తుతం ఐసోలేషన్‌ ఉన్నారు. విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మంచిగానే ఉందని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.

Joe Biden Corona : అమెరికా అధ్యక్షులు జో బైడెన్ కు మరోసారి కరోనా..వైరస్‌ నుంచి కోలుకున్న 3 రోజులకే

Biden

joe biden corona : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డారు. వైరస్‌ నుంచి కోలుకున్న మూడు రోజుల్లోనే బైడెన్‌కు మళ్లీ పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన ప్రస్తుతం ఐసోలేషన్‌ ఉన్నారు. విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మంచిగానే ఉందని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.

79 ఏళ్ల బైడెన్ గతేడాదే కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు వేయించుకున్నారు. బూస్టర్‌ డోస్‌ కూడా తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన రెండుసార్లు కరోనా వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 21న బైడెన్‌కు తొలిసారిగా కరోనా పాజిటివ్‌ వచ్చింది.

Wuhan Lockdown : చైనాలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్.. కరోనా పుట్టినిల్లు వుహాన్‌లో 10లక్షల మంది లాక్‌డౌన్

వైరస్ తీవ్రత పెద్దగా లేకపోవడం, స్వల్ప లక్షణాలు ఉండటంతో ఐసొలేషన్‌లో ఉంటూనే అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించారు. అయితే కరోనా నుంచి కోలుకున్న మూడు రోజుల్లోనే వైరస్ మళ్లీ సోకడం శోచనీయం.