అమెరికాలో తిరగబెట్టిన కరోనా వైరస్.. 24 గంటల్లో 34,700 కేసులు

  • Published By: vamsi ,Published On : June 26, 2020 / 02:27 AM IST
అమెరికాలో తిరగబెట్టిన కరోనా వైరస్.. 24 గంటల్లో 34,700 కేసులు

కరోనా మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి అమెరికాలో 2.3 మిలియన్లకు పైగా కేసులు నమోదవగా 121,000 మందికి పైగా మరణించారు. జాన్స్‌ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం, ఒక రోజు మొత్తం 34,700 కొత్త కోవిడ్-19 కేసులను అమెరికా నమోదు చేసింది. కరోనా మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఏప్రిల్‌లో ఒకే రోజులో 36,400 కేసులు నమోదు కాగా తర్వాత ఇదే అత్యధికం.

ఇప్పటివరకు న్యూయార్క్‌, న్యూజెర్సీలను వణికించిన వైరస్.. అక్కడ తగ్గుముఖం పట్టగా.. లేటెస్ట్‌గా అరిజోనా, కాలిఫోర్నియా, మిస్సిస్సిపి, నెవడా, టెక్సాస్, ఓక్లహామా తదితర నగరాల్లో ప్రతాపం చూపిస్తోంది. టెక్సాస్‌లో రెండు వారాల్లోనే కేసులు మూడు రెట్లు పెరిగాయి. హ్యూస్టన్‌లో పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఐసీయూలు నిండిపోయి.. ప్రభుత్వ ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి.

నార్త్ కరోలినా మరియు దక్షిణ కరోలినా హాస్పిటలైజేషన్ రికార్డులను బద్దలు కొట్టడంలో మరికొన్ని రాష్ట్రాలలో చేరాయి. హ్యూస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్ సిస్టమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ బూమ్ మాట్లాడుతూ.. కరోనా ప్రభావం మళ్లీ ఎక్కువ అయ్యిందని అన్నారు. అమెరికా మరణాల సంఖ్య 122,000కు చేరుకోగా అక్టోబర్ 1 నాటికి దాదాపు 180,000 మరణాలు నమోదు అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు.

Read: పీక్‌లో కరోనా కేసులు.. మనిషి ప్రవృత్తితో మరోసారి వైరస్‌ విజృంభిస్తోంది!