భారత్‌కు అమెరికా అండ… చైనాకు చుట్టూ బలగాల మోహరింపు

భారత్‌కు అమెరికా అండ… చైనాకు చుట్టూ బలగాల మోహరింపు

చైనా సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధంగా ఉన్నామని..ఈ విషయంలో భారత్ కు అండగా ఉంటామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించడం విశేషం. భారత్ తో సహా పలు ఆసియా దేశాలకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నుంచి ముప్పు నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.

తమ అంతర్జాతీయ బలగాలను తరలించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు పాంపియో వెల్లడించారు. బ్రజెల్స్ ఫోరం 2020ని ఉద్దేశించి..వీడియో కాన్ఫరెన్స్ లో పాంపియో మాట్లాడారు. జర్మనీలో అమెరికన్‌ బలగాలను 52 వేల నుంచి 25 వేలకు తగ్గిస్తున్న క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలకు అనుగుణంగా సైనిక బలగాల సమీక్షను చేపడతామన్నారు.

ఇటీవలే భారత్ – చైనా మధ్య సరిహద్దు వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. చర్చల్లో మాత్రం శాంతి మంత్రి జపిస్తూనే..మరోవైపు సైనికులను మోహరింపు చేపడుతోంది. మూడు రాష్ట్రాల సరిహద్దులో చైనా సైన్యం మోహరించింది. చైనా టార్గెట్ గా అమెరికా వ్యూహాలు రచిస్తోంది. జర్మని నుంచి 10 వేల మంది సైనికులను ఉపసంహరించుకొంటోంది అమెరికా.

దక్షిణాసియాకు వారిని తరలించేందుకు చర్యలు చేపడుతోంది. భారత్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా వంటి చైనా దేశాలకు చైనా నుంచి ముప్పు నెలకొందన్నారు. ఈ క్రమంలో అమెరికా విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐరోపా దేశాలతో పాటు తమ భాగస్వాములందరినీ సంప్రదింపులు జరుపుతామని పాంపియో తెలిపారు. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Read: కరోనా యోధులకు వైరస్ ఎలా వస్తుందో తెలుసా ?