Wooden knife : చెక్కతో తయారు చేసిన కత్తి… మాంసాన్ని కూడా స్మూత్ కట్ చేసేస్తుంది..!

చెక్కతో తయారు చేసిన కత్తి గట్టిగా ఉండే మాంసాన్ని కూడా వెన్నను కట్ చేసినంత స్మూత్ కట్ చేసేస్తుంది..

10TV Telugu News

WOODen Knife Very sharp: కూరగాయలు కట్ చేయాలన్నా..మాంసం కట్ చేయాలన్నా..ఆఖరికి పండ్లు కట్ చేయాలన్నా పదునైన చాకు కావాలి. లేదా కత్తి కావాలి. మరి చాకును దేంతో చేస్తారు? అంటే ఇదేం పిచ్చి ప్రశ్న. ఇనుముతో చేస్తారు. స్టీల్ తో చేస్తారు అని చెబుతాం. కానీ ఓ వెరైటీ కత్తి..పోని చాకు మాత్రం డిఫరెంట్. దీన్ని ఇనుముతో గానీ, స్టీల్ తో గానీ చేయలేదు. కానీ మాంసం కూడా చాలా మెత్తగా కట్ అయిపోతుంది. అదే ‘చెక్క కత్తి’ ఏంటీ చెక్కతో కత్తా? అసలు మిగల ముగ్గిన పండు అయినా తెగుతుందా? అసలు చెక్కతో కత్తులు తయారు చేస్తారా? అని అనుకుంటున్నారు కదూ. అందుకే ముందే చెప్పాం..డిఫరెంట్ కత్తి అని. ఈ చెక్క కత్తితో కట్ చేస్తే గొడ్డు మాంసం కూడా చాలా ఈజీగా కట్ అయిపోతుందని చెబుతున్నారు ఈ ‘చెక్క కత్తి’ని తయారు చేసిన సైంటిస్టులు.

Read more : Cricket Bat : బౌండరీలు కొట్టే కొత్త బ్యాట్ తయారు చేస్తున్న కేంబ్రిడ్జి పరిశోధకులు..

అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్శిటీ సైంటిస్టులు చెక్కతో పదునైన కత్తిని తయారు చేశారు. ఇది స్టీల్ కత్తి కంటే 3 రెట్లు పదునైనది అని చెబుతున్నారు. కలపను ప్రత్యేక మార్గంలో కుదించడం ద్వారా దీనిని తాయారు చేశారట. ఈ కత్తితో మాంసం కూడా వెన్నను కట్ చేసినంత చక్కగా స్మూత్ గా కట్ చేయవచ్చని చెబుతున్నారు.

కత్తిని తాయారు చేయడానికి కలపలో కొంత భాగాన్ని తీసుకున్నారు. దానిని ఒక ప్రత్యేక రసాయనంలో ఉంచారు. తర్వాత దానిని కంప్రెస్ చేశారు. అలా చాలాసార్లు చేయడం వల్ల చెక్కలో ఉండే నీటిని అంటే తేమను పూర్తిగా తొలిగించారు. తేమ అంతా తొలగిపోవటంతో ఆ చెక్క గట్టిపడుతుంది. అప్పుడు దాని నుండి ఒక కత్తి తయారు చేశారు. ఈ విధంగా తయారు చేసిన కలప సాధారణ కంటే 23 రెట్లు బలంగా తయారవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ చెక్క కత్తి పర్యావరణానికి ఎటువంటి హానీ చేయదని..అదే స్టీల్ తో తయారు చేసినవైతే తుప్పు పడతాయని అటువంటివాటిని వాడకుదని వాటివల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని కానీ ఈ చెక్క కత్తి వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని జరగదని చెబుతున్నారు.

Rear more : Bride wanted :‘మాకు పెళ్లిళ్లు కావట్లేదు..వధువును వెదికి పెట్టండీ’తహసీల్దారుకు వినతిపత్రం

శాస్త్రవేత్తలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కత్తులు ఉక్కు లేదా సిరామిక్ నుండి తయారు అవుతున్నాయని చెబుతున్నారు. కత్తి చేయాలంటే దాని మెటీరియల్ దృఢంగా ఉండాలి. అదే సూత్రంపై ఇన్నాళ్ళూ కత్తులు చేస్తూ వస్తున్నారు. అయితే, శాస్త్రవేత్తలు చెక్క కత్తులు కూడా అంతే కఠినంగా ఉన్నాయని చెబుతున్నారు. కానీ ఈ చెక్క కత్తి మార్కెట్‌లో ఎంతకాలంలో అందుబాటులో వస్తుందనే విషయంపై సైంటిస్టులు అధికారిక ప్రకటన చేయలేదు.

Read more : China Toys Danger : చైనా బొమ్మల్లో ప్రమాదకర రసాయనాలు..చిన్నారుల ప్రాణాలకు ప్రమాదమంటున్న నిపుణులు

చెక్క ఎందుకు గట్టిగా ఉంటుంది..దానితో ఎలా కత్తిని చేయవచ్చు అనేదాని విషయంపై టెంగ్ లి అనే పరిశోధకుడు మాట్లాడుతు..”చెక్కలో సెల్యులోజ్ అనే మూలకం ఉంటుంది. కలప దట్టంగా.. బలంగా ఉండటానికి ఆ మూలకమే కారణం. దీంతో చెక్కను సెరామిక్స్, లోహాల కంటే బలంగా తయారుచేయవచ్చు. అయితే కలపలో ఇటువంటి నాణ్యత గురించి ఇప్పటి వరకు ఎవరూ బయటకు తీయలేదు. ఇప్పుడు మేము కత్తి ద్వారా ఈ విషయాన్ని ముందుకు తెస్తున్నాము.” అని టెంగ్ లి తెలిపారు.

కలపలో 40 నుండి 50 శాతం సెల్యులోజ్ ఉంటుంది. మిగిలినవి హేమిసెల్యులోజ్..లిగ్నిన్ మూలకాలు. ఇవి బలహీనంగా ఉంటాయి. అందుకే చెక్కలోని ఇటువంటి బలహీన అంశాలను తొలగించి సెల్యులోజ్ ను కత్తి తాయారు చేయడానికి ఉపయోగించామని తెలిపారు.

జర్నల్ మ్యాటర్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం..ఈ కత్తికి పదునైన అంచు మాత్రమే కాదు..దుమ్ముని నిరోధించే శక్తి కూడా ఉందట. అంటే ఇది యాంటీ డస్ట్, దీనికి దుమ్ము అంటుకోదు. సాధారణంగా మనం చాకుల్ని కత్తులు వాడేటప్పుడు అవి పదును తగ్గిపోతుంటాయి. దీంతో వాటినికి పదును పెట్టిస్తుంటాము. మరి ఈ చెక్క కత్తి విషయానికి వస్తే అలా చేయవచ్చా? అనే అనుమానాలు కూడా వస్తాయి. ఎందుకంటే ఒక్కసారి వాడాక దాని పదును తగ్గిపోతే పారేయలేం కదా? అందుకే దీని గురించి కూడా సైంటిస్టులు క్లారిటీ ఇచ్చారు. దీని అంచును కూడా సాధారణ కత్తిలాగా పదును పెట్టవచ్చు అని తెలిపారు. అంతేకాదు సాధారణంగా చెక్క వస్తువులకు తడి తగిలితే పాడైపోతాయి. కానీ ఈ చెక్క కత్తి అలాకాదు. దీంతో కూరగాయాలు, మాంసం, పండ్లు ఇలా ఏదైనా సరే కట్ చేసాక దాన్ని సాధారణ చాకుల్ని కడిగినట్లే నీటితో కడిగేసుకోవచ్చట. ఈ చెక్క కత్తిని ఉపయోగించిన తరువాత చక్కగా కడిగి పెట్టుకోవచ్చు అని చెబుతున్నారు.