Russia-Ukraine War: ర‌ష్యాపై భారత్ మ‌రింత ఒత్తిడి పెంచాలి: అమెరికా

ఉక్రెయిన్‌పై దాడులు చేస్తోన్న ర‌ష్యాపై మ‌రింత ఒత్తిడి పెంచాలని భార‌త్‌కు అమెరికా సూచించింది. ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భార‌త్ త‌ట‌స్థ వైఖ‌రిని అవ‌లంబిస్తోన్న విష‌యం తెలిసిందే.

Russia-Ukraine War: ర‌ష్యాపై భారత్ మ‌రింత ఒత్తిడి పెంచాలి: అమెరికా

India America Flags

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై దాడులు చేస్తోన్న ర‌ష్యాపై మ‌రింత ఒత్తిడి పెంచాలని భార‌త్‌కు అమెరికా సూచించింది. ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భార‌త్ త‌ట‌స్థ వైఖ‌రిని అవ‌లంబిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అమెరికా జాతీయ భ‌ద్ర‌తా మండ‌లి స‌మ‌న్వ‌య‌క‌ర్త జాన్ కిర్బీ తాజాగా మాట్లాడుతూ.. ర‌ష్యాపై ప్ర‌పంచ దేశాలు కూడా మ‌రింత ఒత్తిడి పెంచాల‌ని అన్నారు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా పాల్ప‌డుతోన్న చ‌ర్య‌ల‌కు స్పంద‌నగా అమెరికా ఈ సూచ‌న చేస్తోంద‌ని తెలిపారు.

presidential election 2022: శివాలయంలో చీపురుతో ఊడ్చిన ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము

అమెరికాకు ఇండో-ప‌సిఫిక్ ప్రాంతంలో భార‌త్ కీల‌క వ్యూహాత్మ‌క భాగ‌స్వామి అని చెప్పారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోన్న ర‌ష్యా అందుకు త‌గ్గ తీవ్ర‌ ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి ఉంద‌ని అన్నారు. భార‌త్‌తో ధ్వైపాక్షిక స‌త్సంబంధాల‌కు అమెరికా ప్రాధానం ఇస్తోంద‌ని తెలిపారు. ర‌ష్యా నుంచి ఇంధ‌న దిగుమ‌తులు చేసుకుంటోన్న భార‌త్ గురించి అమెరికా స్పంద‌న ఏంట‌ని ఆయ‌న‌ను మీడియా ప్ర‌శ్నించింది.

Presidential Elections: 27న నామినేష‌న్ వేయ‌నున్న య‌శ్వంత్ సిన్హా.. ఎన్డీఏ అభ్య‌ర్థి 25న‌?

దీంతో ఆయ‌న స్పందిస్తూ… ఇండియా ఆర్థిక విధానాల‌పై భార‌త దేశ‌ నాయ‌కులే మాట్లాడాల‌ని అన్నారు. అయితే, విధానాల‌పై స్వ‌యంగా నిర్ణ‌యాలు తీసుకునే హ‌క్కు ప్ర‌తి దేశానికి ఉంద‌ని అన్నారు. కాగా, అమెరికా స‌హా ప‌శ్చిమ దేశాలు ఇప్ప‌టికే ర‌ష్యాపై ఆంక్ష‌లు విధించాయి. మిగ‌తా దేశాలు కూడా ర‌ష్యాపై ఒత్తిడి పెంచాల‌ని అమెరికా కోరుతోంది.