Strange marriage : భర్తకు విడాకులిచ్చి మామను పెళ్లి చేసుకున్న కోడలు..!

Strange marriage : భర్తకు విడాకులిచ్చి మామను పెళ్లి చేసుకున్న కోడలు..!

Strange Marriage (1)

us woman marries ex husbands father : మనసుకు నచ్చితే పెళ్లి చేసుకోవడం, కొంత కాలం తర్వాత విభేదాలు తలెత్తితే విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత మరొకరిని వివాహం చేసుకోవడం ఈ రోజుల్లో సర్వ సాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో అయితే మరింత కామన్. అయితే అమెరికాలో ఓ వింత ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎరికా అనే మహిళ తన భర్తకు విడాకులిచ్చి.. అతని తండ్రిని వివాహం చేసుకుంది. ఇది కాస్త వింత గొలిపే వివాహం అనే చెప్పాలి.

కెంటుకీ ప్రాంతంలో నివసిస్తున్న ఎరికా కొన్నేళ్ల క్రితం జస్టిన్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఓ మగపిల్లాడు కూడా పుట్టాడు. కొన్నాళ్లు వారి కాపురం బాగానే సాగింది. కొంతకాలానికి వారి సంసారంలో కలహాలు వచ్చాయి. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చటంలేదు. దీంతో అభిప్రాయాలు కలవనప్పుడు కలిసి ఉండటం ఎందుకు? విడిపోదామనుకున్నారు. అలా ఇద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు.

ఆ తరువాత ఎరికా జెఫ్‌ అనే మరో వ్యక్తితో ప్రేమలో పడింది. ఎరికా ప్రేమించిన జెఫ్ వేరెవరో కాదు.. జెస్టిన్ సవతి తండ్రి. అంటే ఎరికా పాత భర్తకు సవతి తండ్రి. అతను ఎరికా కంటే ఏకంగా 29 ఏళ్ల పెద్దవాడు. కానీ ప్రేమకు వయస్సు తెలీదటకదా. అలా ఒక జనరేషన్ గ్యాప్ ఉన్నా వారిద్దరూ ఒకరంటే మరొకరు ఇష్టపడ్డారు.

ఒకప్పుడు తనకు మామ అయిన జెఫ్‌ను ఎరికా ఇటీవలె వివాహం చేసుకుంది. ఒకప్పుడు తన భార్య అయిన ఎరికా ఇప్పుడు తనకు పిన్ని కావడాన్ని జెస్టిన్ నమ్మలేకపోతున్నాడు. ఇంతకంటే ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే పాత భర్తతో కలిసి ఎరికా కొత్త భర్త అందరూ కలిసి ఒకే ఇంటిలో ఉంటున్నారు. ఆ ముగ్గురు ఇప్పుడు ఒకే ఇంట్లో కలిసి జీవిస్తున్నారు. అదీ అమెరికాలాంటి పాశ్చాత్య పోకడలు. అఫ్ కోర్స్ కేవలం అమెరికాలోనే కాదు పలు దేశాల్లో కూడా ఇటువంటివి జరగకపోలేదనుకోండీ..

Son

 సవతి కొడుకును వివాహం చేసుకున్న తల్లి 

కాగా..రష్యాలో ఓ మహిళ భర్తకు విడాకులిచ్చి తనకంటే చిన్నవాడైన భర్త కొడుకునే పెళ్లి చేసుకున్న ఘటన వైలర్ అయిన విషయం తెలిసిందే. ఇన్ఫ్లుయేన్సార్ మరీనా బల్మాషేవా పదేళ్ల కిందట 45 ఏళ్ల అర్రేను పెళ్లి చేసుకుంది. అర్రేకు అప్పటికే పదేళ్ల కొడుకు ఉన్నాడు. మరీనా కూడా అతడిని కన్న కొడుకులా ఎంతో ప్రేమగా చూసుకొనేది. అయితే, కొన్ని నెలల కిందట అర్రేతో స్పర్థలు ఏర్పడటంతో మరీనా అతడికి విడాకులిచ్చింది. ఒంటరిగా జీవించడం మొదలుపెట్టింది.

అయితే, పదేళ్లపాటు ఆమెతోపాటు పెరిగిన కొడుకు వ్లాడిమిర్ మరీనాను వదిలి ఉండలేకపోయాడు. పైగా వ్లాడిమిర్‌కు 20 ఏళ్లు దాటాయి. మరీనా తన తండ్రికి విడాకులిచ్చి వదిలేసినా.. వ్లాడిమిర్ మాత్రం ఆమెను దూరం చేసుకోలేదు. నిత్యం ఆమెను కలుస్తూనే ఉండేవాడు. దీంతో వారి మధ్య ఉన్నది తల్లి-కొడుకుల బంధం కాదని, దానికి మించినదని మరీనా భావించింది. ఆమె తన మనసులో మాటను వ్లాడిమిర్‌కు చెప్పింది. ఇందుకు అతడు కూడా అంగీకరించాడు.

తమ ప్రేమను పెళ్లితో కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ వార్త విని ఆమె మాజీ భర్తకు గుండె ఆగినంత పనైంది. తనతో కాపురం చేసి.. అన్ని సుఖాలు పొందిన మాజీ భార్య తనకు కోడలిగా తిరిగి వస్తుందని తెలిసి ఆవేదనకు గురయ్యాడు. కానీ, కొడుకు ఇష్టాన్ని కాదనలేక అయిష్టంతోనే వారి నిర్ణయాన్ని పెద్ద మనస్సుతో స్వాగతించాడు. దీంతో ఇద్దరు చట్టబద్దంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరికి ఓ మగపిల్లాడు పుట్టాడు. ఇలా పాశ్చాత్య దేశాల్లో వివాహాలు పెద్ద విషయంగా అనిపించవు. వీళ్లు ఎవరికి ఎవరు ఏమవుతారో అనేది చెప్పటం మాత్రం చాలా కష్టమే..