USC Molestation : లైంగిక వేధింపుల కేసులో కనీవిని ఎరుగని సెటిల్‌మెంట్‌, బాధితులకు 7వేల కోట్లు చెల్లింపు

అమెరికాలో చోటు చేసుకున్న లైంగిక వేధింపుల కేసు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో భారీ సెటిల్ మెంట్ హైలైట్ అయ్యింది. వెయ్యి కాదు రెండు వేలు కాదు ఏకంగా రూ.7వేల కోట్లు.. లైంగికంగా వేధింపులకు గురైన బాధిత మహిళలకు చెల్లించేందుకు అంగీకారం జరిగింది.

USC Molestation : లైంగిక వేధింపుల కేసులో కనీవిని ఎరుగని సెటిల్‌మెంట్‌, బాధితులకు 7వేల కోట్లు చెల్లింపు

Usc Molestation

USC Molestation : అమెరికాలో చోటు చేసుకున్న దశాబ్దాల నాటి లైంగిక వేధింపుల కేసు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో భారీ సెటిల్ మెంట్ హైలైట్ అయ్యింది. వెయ్యి కాదు రెండు వేలు కాదు ఏకంగా రూ.7వేల కోట్లు.. లైంగికంగా వేధింపులకు గురైన బాధిత మహిళలకు చెల్లించేందుకు అంగీకారం జరిగింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ కాలిఫోర్నియా(యూఎస్‌సీ) ఈ మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరిస్తున్నట్లు లాస్ ఏంజెలిస్‌ కోర్టుకు తెలిపింది.

అసలేం జరిగిందంటే..
యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ కాలిఫోర్నియా(యూఎస్‌సీ) లో జార్జి టిండాల్‌(74) అనే వ్యక్తి గైనకాలజిస్ట్ గా పని చేసేవాడు. పవిత్రమైన వృత్తిలో ఉంటూ అతగాడు నీచానికి ఒడిగట్టాడు. 30ఏళ్ల సర్వీస్ లో వందల మంది మహిళలను లైంగికంగా వేధించాడు. ఆ నీచుడు మైనర్లను కూడా వదల్లేదు. మెడికల్‌ చెకప్‌ కోసం వచ్చిన స్త్రీలను టిండాల్‌ లైంగిక వేధింపులకు గురి చేశాడు.

రోగుల ప్రైవేట్ పార్ట్స్ తాకేవాడు. అంతేకాదు ఫోటోలూ తీసేవాడు. వారి శరీరాకృతి గురించి నీచమైన కామెంట్స్‌ చేసేవాడు. యూనివర్సిటీలో ఎక్కువగా ఉన్న ఆసియా ఖండం విద్యార్థులను టార్గెట్‌ చేసి వేధింపులకు పాల్పడేవాడు. 1990లో తొలిసారి ఓ టీనేజ్‌ యువతి చేసిన ఫిర్యాదుతో టిండాల్‌ బాగోతం బట్టబయలైంది. మెడికల్‌ చెకప్‌ కోసం వెళ్లిన తనను టిండాల్‌ అసభ్యకర రీతిలో తాకుతూ అత్యాచారం చేశాడని ఆమె చెప్పింది.

టిండాల్‌పై వచ్చిన ఆరోపణలపై స్పందించడంలో విఫలమైనందుకు వేలాది మంది మాజీ రోగులు విశ్వవిద్యాలయంపై కేసు వేశారు. డాక్టర్ చర్యల గురించి సంస్థకు తెలుసని.. అయినా అతడిపై చర్యలు తీసుకోకుండా సర్వీసులోనే కొనసాగించారని బాధితులు ఆరోపించారు. పైగా 2016 వరకు యూఎస్‌సీ అధికారులు టిండాల్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయలేదని.. విశ్వవిద్యాలయంతో ఉన్న స్నేహపూర్వక ఒప్పందం వల్ల టిండాల్‌ పదవీ విరమణ చేయడానికి అంగీకరించారని బాధితులు తెలిపారు.

ఈ ఆరోపణలకు సంబంధించి యూఎస్‌సీ ఇప్పటికే 200,000 డాలర్లు(1,45,23,803 రూపాయలు) చెల్లించినట్లు తెలిసింది. తాజాగా 1 బిలియన్ డాలర్లకు పైగా(7,246,00,00,000 రూపాయలు) చెల్లించడానికి అంగీకారం తెలిపింది. సివిల్‌ లిటిగేషన్‌ చరిత్రలో లైంగిక వేధింపుల కేసులో ఇంత భారీ మొత్తంలో చెల్లించడానికి అంగీకరించడం ఇదే ప్రథమం అని లాయర్ గ్లోరియా ఆల్రెడ్ తెలిపారు. ఇక నేరం రుజువైతే టిండాల్‌ 53 ఏళ్ల పాటు జైళ్లో ఉంటాడని చెప్పారు.