Viral Video: కారు కిటికీనుంచి న‌డిరోడ్డుపై ప‌డిపోయిన పాప

సిగ్న‌ల్ వ‌ద్ద ఆగిన కారు కిటికీ నుంచి తల బయటకు పెట్టింది ఓ పాప‌. గ్రీన్ సిగ్న‌ల్ ప‌డ‌డంతో ఆ కారు ఒక్క‌సారిగా ముందుకు క‌ద‌ల‌డంతో ఆ పాప‌ కిటికీ నుంచి న‌డిరోడ్డుపై ప‌డిపోయింది. అయితే, ఆ పాప ప‌డిపోయిన విష‌యాన్ని కూడా గ‌మ‌నించ‌కుండా, ఆమెను అక్క‌డే వ‌దిలేసి ఆ కారును ముందుకు తీసుకెళ్ళాడు డ్రైవ‌ర్. ఈ ఘ‌ట‌న చైనాలోని నింగ్బో న‌గ‌రంలో చోటు చేసుకుంది.

Viral Video: కారు కిటికీనుంచి న‌డిరోడ్డుపై ప‌డిపోయిన పాప

Viral Video: సిగ్న‌ల్ వ‌ద్ద ఆగిన కారు కిటికీ నుంచి తల బయటకు పెట్టింది ఓ పాప‌. గ్రీన్ సిగ్న‌ల్ ప‌డ‌డంతో ఆ కారు ఒక్క‌సారిగా ముందుకు క‌ద‌ల‌డంతో ఆ పాప‌ కిటికీ నుంచి న‌డిరోడ్డుపై ప‌డిపోయింది. అయితే, ఆ పాప ప‌డిపోయిన విష‌యాన్ని కూడా గ‌మ‌నించ‌కుండా, ఆమెను అక్క‌డే వ‌దిలేసి ఆ కారును ముందుకు తీసుకెళ్ళాడు డ్రైవ‌ర్. దీంతో ఆ పాప రోడ్డు మ‌ధ్య‌లో ప‌డిన‌చోటే ఉండిపోయింది. వేరే ఇత‌ర వాహ‌నాల్లోని డ్రైవ‌ర్లు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి త‌మ కార్ల‌ను ఆప‌డంతో ఆ పాప‌కు పెను ప్ర‌మాదం త‌ప్పింది.

సిగ్న‌ల్ వ‌ద్దే కార్ల‌ను ఆపిన కొంద‌రు ఆ పాప‌ను రోడ్డు ఎత్తుకుని రోడ్డు ప‌క్క‌కు తీసుకెళ్ళారు. ఈ ఘ‌ట‌న చైనాలోని నింగ్బో న‌గ‌రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ బాలిక‌కు స్వ‌ల్ప గాయాలు కావ‌డంతో ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. కారులో నుంచి పాప‌ప‌డిపోయిన విష‌యం కారు డ్రైవ‌రు గుర్తించ‌లేన‌ట్లు తెలుస్తోంది. ఆ పాప కారులోంచి పడిపోయిన దృశ్యాల వీడియోను ఒకరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.