Russia-Ukraine war: ఘర్షణలు సృష్టించి లబ్ధిపొందాలని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి: పుతిన్

రష్యా భూభాగాల్లోని ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించి లబ్ధిపొందాలని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఉక్రెయిన్ విషయంలో తాము పోరాడుతున్నది రష్యా ప్రజలను ఏకం చేయడానికేనని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న భీకరదాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ పుతిన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... విభజించి, జయించు అనే ప్రణాళికనే పశ్చిమ దేశాలు ఎల్లప్పుడూ అమలు చేస్తున్నాయని విమర్శించారు.

Russia-Ukraine war: ఘర్షణలు సృష్టించి లబ్ధిపొందాలని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి: పుతిన్

Russia president putin

Russia-Ukraine war: రష్యా భూభాగాల్లోని ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించి లబ్ధిపొందాలని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఉక్రెయిన్ విషయంలో తాము పోరాడుతున్నది రష్యా ప్రజలను ఏకం చేయడానికేనని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న భీకరదాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ పుతిన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… విభజించి, జయించు అనే ప్రణాళికనే పశ్చిమ దేశాలు ఎల్లప్పుడూ అమలు చేస్తున్నాయని విమర్శించారు.

అయితే, తమ లక్ష్యం మాత్రం వేరుగా ఉందని, రష్యా ప్రజలను ఏకం చేయడమే తమ ధ్యేయమని పుతిన్ చెప్పారు. తమ దేశ, పౌరుల ప్రయోజనాలను కాపాడుకునేందుకు తాము సరైన దిశలోనే వెళ్తున్నామని ఆయన అన్నారు. షరతులు లేకుండా చర్చలు జరిపితే అందులో పాల్గొనేందుకు రష్యా సిద్ధంగానే ఉందని చెప్పారు.

ఉక్రెయిన్ కు అమెరికా అధునాతన గగనతల రక్షణ వ్యవస్థను పంపనున్న విషయంపై పుతిన్ స్పందిస్తూ… దాన్ని 100 శాతం నాశనం చేస్తామని అన్నారు. కాగా, అధునాతన గగనతల వ్యవస్థను అందిస్తామని ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. పశ్చిమ దేశాలు అందిస్తున్న ఆయుధాల సాయంతో రష్యాపై ఉక్రెయిన్ పోరాడుతోంది. రష్యాకు ఎట్టిపరిస్థితుల్లోనూ తలొగ్గబోమని ఇప్పటికే పలుసార్లు జెలెన్ స్కీ స్పష్టం చేశారు.

Viral Video: క్రిస్మస్ స్పెషల్… -30 డిగ్రీల చలిలో భాంగ్రా నృత్యం చేసిన గుర్దీప్ పంధర్