Australia : ఆస్ట్రేలియాలో అండర్‌వేర్‌తో వచ్చి ఓటు వేసిన ఓటర్లు

అండర్​వేర్​లో ఓటేస్తూ ఫొటో దిగి, సోషల్​ మీడియాలో షేర్​ చేస్తే తమ బ్రాండెడ్​ స్విమ్​వేర్​ను ఉచితంగా ఇస్తామని ఆ సంస్థ ప్రకటించింది. దీంతో ఈ ఆఫర్‌ను చేజిక్కించుకునేందుకు అనేకమంది రంగురంగుల అండర్‌వేర్‌లలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేసి, ఆ ఫొటోలను పోస్ట్ చేశారు.

Australia : ఆస్ట్రేలియాలో అండర్‌వేర్‌తో వచ్చి ఓటు వేసిన ఓటర్లు

Astralia

Australia Voters : ఆస్ట్రేలియాలో జరిగిన ప్రధాని ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనేకమంది లోదుస్తుల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలిరావడం చర్చనీయాంశమైంది. మహిళలు స్విమ్‌సూట్‌ ధరించగా, పురుషులు కేవలం అండర్‌వేర్‌లో వచ్చి ఓటేశారు. బడ్జీ స్మగ్లర్స్​అనే స్విమ్ వేర్​ కంపెనీ ఇచ్చిన ఓ ఆఫరే దీనికి కారణమైంది.

అండర్​వేర్​లో ఓటేస్తూ ఫొటో దిగి, సోషల్​ మీడియాలో షేర్​ చేస్తే తమ బ్రాండెడ్​ స్విమ్​వేర్​ను ఉచితంగా ఇస్తామని ఆ సంస్థ ప్రకటించింది. దీంతో ఈ ఆఫర్‌ను చేజిక్కించుకునేందుకు అనేకమంది రంగురంగుల అండర్‌వేర్‌లలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేసి, ఆ ఫొటోలను పోస్ట్ చేశారు.

Australia pm Anthony Albanese : పేదరికంలో పుట్టిపెరిగిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌..పెన్షన్‌ డబ్బులతో పెంచి పెద్దచేసిన తల్లి

తమ ఆఫర్​కు అనూహ్య స్పందన వచ్చిందంటూ బడ్జీ స్మగ్లర్స్ ఆనందం వ్యక్తం చేసింది. ఒకరిద్దరు పాల్గొంటారని భావిస్తే వందల మంది ముందుకు వచ్చారని హర్షం వ్యక్తం చేసింది. ఈ ఛాలెంజ్​లో పాల్గొన్న వారందరికీ ఇవాళ్టి నుంచి బహుమతులు అందజేయనుంది.