Walrus : వాలీ దొరికిందోచ్..జంతు ప్రేమికుల్లో ఆనందం

కొద్ది రోజుల క్రితం అకస్మాత్తుగా కనిపించకుండా పోయిన "వాలీ" ఆచూకీ ఎట్టకేలకు 22 రోజుల తర్వాత లభించింది. చివరిసారిగా ఐర్లాండ్‌లో కనిపించిన వాలీ.. తిరిగి 22 రోజుల తర్వాత ఆదివారం

Walrus : వాలీ దొరికిందోచ్..జంతు ప్రేమికుల్లో ఆనందం

Wally

కొద్ది రోజుల క్రితం అకస్మాత్తుగా కనిపించకుండా పోయిన “వాలీ” ఆచూకీ ఎట్టకేలకు 22 రోజుల తర్వాత లభించింది. చివరిసారిగా ఐర్లాండ్‌లో కనిపించిన వాలీ.. తిరిగి 22 రోజుల తర్వాత ఆదివారం ఐస్‌లాండ్‌ సమీపంలో దర్శనమిచ్చింది.

వాలీగా పిలువడే వాల్రస్‌(ధ్రువపు జీవి)సముద్ర జలాల్లో తన విభిన్న చేష్టలతో ప్రఖ్యాతి గాంచింది. 800 కిలోల బరువు ఉంటుంది. దీనికి ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇది ఎక్కువ ఆర్కిటిక్‌ ప్రాంత సముద్ర జలాల్లో క‌నిపిస్తుంది. ఇవి చాలా అరుదుగా ఉంటాయి. ఇది ఐర్లాండ్ లో ఉండేది. కానీ కొద్ది రోజుల క్రితం అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో వాలీ అభిమానులు అలాగే చాలా మంది జంతు ప్రేమికులు, పర్యాటకులు ఆందోళన చెందారు. వాలీ చనిపోయిందనుకుని బాధపడ్డారు. వాలీ ఎక్క‌డా ఉన్న క్షేమంగా ఉండాలంటూ పూజ‌లు కూడా చేశారు. మ‌రి కొంత మంది అయితే సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.

చివ‌రికి 22 రోజుల త‌ర్వాత వాలీ జాడ ల‌భించింది. ఈ 22 రోజుల‌లో దాదాపు 900 కిలో మీట‌ర్లు ప్ర‌యాణించి ఆదివారం ఐస్‌లాండ్‌ సమీపంలో దర్శనమిచ్చింది. వాలీని ఐస్ లాండ్ దీవుల స‌మీపంలో బ్ర‌టిష్ షిప్ డైవ‌ర్స్ క‌నిపెట్టారు. వాలీ శరీరం మీద ఉన్న గుర్తుల ఆధారంగా ఇది వాలీ నే అని సీల్ రెస్క్యూ ఐర్లాండ్ నిర్ధ‌రించింది. ఈ విష‌యాన్ని సీల్ రెస్క్యూ ఐర్లాండ్ సిబ్బంది ట్వీట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. అది తిరిగి తన స్వస్థలం ఐర్లాండ్‌కు వచ్చేందుకు ఈదడం మొదలుపెట్టిందని తెలిపారు. వివిధ దేశాల మీదుగా దాదాపు 4,000 కిలోమీటర్లు ప్రయాణించి ఐర్లాండ్‌కు చేరుకుంటుందని సీల్‌ రెస్క్యూ ఐర్లాండ్‌ అంచనా వేస్తున్నారు. వాలీ ఆచూకీ తెలియడం తో జంతు ప్రేమికులు, ప‌ర్యాట‌కులు సంతోషం వ్యక్తం చేశారు.