టిక్‌టాక్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన వాల్‌మార్ట్!

  • Published By: vamsi ,Published On : August 28, 2020 / 09:28 AM IST
టిక్‌టాక్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన వాల్‌మార్ట్!

మైక్రోసాఫ్ట్ సంస్థ వివాదాల్లో చిక్కుకున్న షార్ట్ వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్ యుఎస్ ఆపరేషన్‌ను కొనుగోలు చేయబోతున్నట్లుగా చాలా కాలంగా వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు వాల్‌మార్ట్ కూడా మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపి టిక్‌టాక్‌ను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతోంది. వాల్‌మార్ట్ ఇప్పుడు టెక్నాలజీ మరియు మీడియాలో ప్రవేశించాలని ఆలోచిస్తుంది. తద్వారా యువతకు చేరువ కావాలని వాల్‌మార్ట్ భావిస్తుంది.



ఈ చర్య సంస్థ థార్డ్ పార్టీ ఆన్‌లైన్ మార్కెట్ వృద్ధికి సహాయపడుతుందని వాల్‌మార్ట్ చెబుతుంది. ఈ రెండు సంస్థలు ఇప్పటికే కలిసి పనిచేస్తుండగా.. మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తుంది. మైక్రోసాఫ్ట్ సహకారంతో వాల్‌మార్ట్ ఇప్పుడు టిక్‌టాక్‌ను కొనుగోలు చేస్తుందనే వార్త వచ్చిన వెంటనే, వాల్‌మార్ట్ షేర్లు దాదాపు 3.6 శాతం పెరిగి న్యూయార్క్‌లో 135.47 డాలర్లకు చేరుకున్నాయి. జూలై 7 నుండి 1 రోజులో ఇది అతిపెద్ద లాభం.
https://10tv.in/5-countries-of-armed-forces-will-be-strong-by-2030-china-will-overcome-us-by-this-time/
చైనాకు చెందిన టిక్‌టాక్‌ను అనేక దేశాలు బ్యాన్ చేస్తుండగా.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి మైక్రోసాఫ్ట్ అనేక వారాలుగా చర్చలు జరుపుతుంది. అయితే టిక్‌టాక్‌ను కొనడానికి చర్చలు ఎక్కడివరకు వచ్చాయో ఇంకా స్పష్టంగా తెలియలేదు. యుఎస్‌తో పాటు, కెనడా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లలో టికెట్‌కాక్ వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేస్తుంది. ఒరాకిల్ కార్పొరేషన్ మరియు ట్విట్టర్ వంటి మరికొన్ని కంపెనీలు కూడా ఈ రేసులో ఉన్నాయి.