Nepal Plane Crash: నేపాల్‌లో విమానం కూలేముందు ఏం జరిగిందంటే.. వీడియో వైరల్..

విమానం కుప్పకూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి. పరిసర ప్రాంతాల ప్రజలకు అక్కడ ఏం జరుగుతుందో కొద్దిసేపు అర్థంకాని పరిస్థితి. చైనా సహకారంతో పొఖారా విమానాశ్రయాన్ని నిర్మించారు. ఈ విమానా శ్రయాన్ని 2023 జనవరి 1న ఆ దేశ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రారంభించారు.

Nepal Plane Crash: నేపాల్‌లో విమానం కూలేముందు ఏం జరిగిందంటే.. వీడియో వైరల్..

Nepal Plane Crash_

Nepal Plane Crash: నేపాల్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో లాండింగ్ సమయంలో యతి ఎయిర్ లైన్స్‌కు చెందిన ఏటీఆర్-72 విమానం కుప్పకూలింది. విమానం ప్రమాద సమయంలో 72 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఐదుగురు భారతీయులను కలుపుకొని మొత్తం 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం ఒక్కసారిగా కుప్పకూలి మంటల్లో దగ్దమైంది. ఇందులోని వారంతా మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు 40కిపైగా మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశాయి.

Pokhara Airport: 72 మందితో వచ్చి విమానాశ్రయం రన్‌ వేపై కుప్పకూలిన విమానం.. 17 మంది మృతి

విమానం కుప్పకూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి. పరిసర ప్రాంతాల ప్రజలకు అక్కడ ఏం జరుగుతుందో కొద్దిసేపు అర్థంకాని పరిస్థితి. చైనా సహకారంతో పొఖారా విమానాశ్రయాన్ని నిర్మించారు. దీని నిర్మాణానికి చైనా ఎగ్జిమ్ బ్యాంక్ నేపాల్ కు రుణం ఇచ్చింది. ఈ విమానా శ్రయాన్ని 2023 జనవరి 1న ఆ దేశ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రారంభించారు. విమానం కుప్పకూలిన సమయంలో యతి ఎయిర్ లైన్స్ విమానం రన్ వే నుండి కేవలం పది సెకన్ల దూరంలో ఉందని పొఖారా ఎయిర్ పోర్టు అథారిటీ తెలిపింది.

 

ప్రమాదంకు కొన్ని సెంకన్ల ముందు విమానం గాలిలో చక్కర్లు కొడుతున్న వీడియో వైరల్ గా మారింది. విమాన ప్రమాదానికి ముందు గాలిలో ఎడమవైపుకు ఎక్కువగా విమానం వాలినట్లు స్పష్టంగా కనిపించింది. ఇదిలాఉంటే నేపాల్ లో ప్రమాదానికి ముందే విమానంలో మంటలు చెలరేగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ ప్రమాద ఘటనపై విచారణ జరుగుతుంది. విమానంలో ప్రయాణిస్తున్న 72 మంది మరణించినట్లేనని, అయితే మృతదేహాల వెలికితీత సమయం పడుతుందని స్థానిక అధికారులు తెలిపారు.