Pokhara Airport: 72 మందితో వచ్చి విమానాశ్రయం రన్‌ వేపై కుప్పకూలిన విమానం.. 17 మంది మృతి

నేపాల్‌లోని పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌ వేపై ఓ విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. విమానానికి మంటలు అంటుకున్నాయి. సహాయక బృందాలు కొందరు ప్రయాణికులను కాపాడి ఆసుపత్రికి తరలించారు. విమాన ప్రమాదంలో 17 మంది మృతి చెందారని ఓ ఆర్మీ అధికారి తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Pokhara Airport: 72 మందితో వచ్చి విమానాశ్రయం రన్‌ వేపై కుప్పకూలిన విమానం.. 17 మంది మృతి

Pokhara Airport

Pokhara Airport: నేపాల్‌లోని పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌ వేపై ఓ విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. విమానానికి మంటలు అంటుకున్నాయి. సహాయక బృందాలు కొందరు ప్రయాణికులను కాపాడి ఆసుపత్రికి తరలించారు. విమాన ప్రమాదంలో 17 మంది మృతి చెందారని ఓ ఆర్మీ అధికారి తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. విమానాశ్రయానికి వచ్చే విమానాలను వేరే చోటుకి మళ్లించే అవకాశం ఉంది. కుప్పకూలిన ఆ విమానం యతి విమానాయాన సంస్థకు చెందిన ఏటీఆర్ 72 విమానమని అధికారులు తెలిపారు.

అది కాఠ్మాండూ నుంచి పొఖ్రా వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని అన్నారు. విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు, పొగ వెలువడుతోంది. ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విమాన ప్రమాదంపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Indian Cricketer Ashwin: కెప్టెన్ రోహిత్‌శర్మ నిర్ణయాన్ని తప్పుబట్టిన అశ్విన్.. అలాచేయడం సరికాదంటూ ..