Man died In Flight : విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తి రక్తం కక్కుకుని మృతి

విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందారు. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా రక్తం కక్కుకుని మరణించారు.

Man died In Flight : విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తి రక్తం కక్కుకుని మృతి

DEAD

Updated On : January 15, 2023 / 10:42 AM IST

Man died In Flight : విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందారు. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా రక్తం కక్కుకుని మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడాకు చెందిన అతుల్ గుప్తా(60) అనే వృద్ధుడు ముధురై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా అతను అనారోగ్యానికి గురై, రక్తం కక్కుకున్నారు. దీంతో విమాన సిబ్బంది అలర్ట్ అయింది.

విమానాన్ని ఇండోర్ లోని దేవి అహిల్యాబాయ్ హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవరంగా ల్యాండ్ చేసింది. బాధిత ప్రయాణికుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Heart Attack : కువైట్ నుంచి వచ్చిన విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు..ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి

మృతుడిని నోయిడాకు చెందిన అతుల్ గుప్తాగా గుర్తించారు. అయితే అతుల్ గుప్తా గుండె సంబంధిత వ్యాధితోపాటు బీపీ, షుగర్ రోగాలతో బాధపడుతున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. గుప్తా మృత దేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.