Israel Palestina Crisis: ఏంటీ ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం? చిన్న స్థలం కోసం ఎందుకు మూడు మతాలు అంతలా కొట్టుకుంటున్నాయి?

ఐక్యరాజ్యసమితి చేసిన ఈ ప్రకటనను యూదులు అంగీకరించినప్పటికీ, అరబ్ ప్రజలు వ్యతిరేకించారు. ఈ కారణంగా ఇది ఎప్పుడూ అమలు కాలేదు. ఈ సమస్యను బ్రిటన్ పరిష్కరించలేక అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత 1948లో యూదు నాయకులు ఇజ్రాయెల్‌ను సృష్టిస్తున్నట్లు ప్రకటించారు.

Israel Palestina Crisis: ఏంటీ ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం? చిన్న స్థలం కోసం ఎందుకు మూడు మతాలు అంతలా కొట్టుకుంటున్నాయి?

Israel Palestina Crisis: ఇజ్రాయెల్, హమాస్ మధ్య మరోసారి ఘర్షణ నెలకొంది. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పై 5000 రాకెట్లను ప్రయోగించినట్లు హమాస్ ప్రకటించింది. హమాస్ దాడి కారణంగా ఇప్పటి వరకు 40 మంది వరకు మరణించారు. కాగా హమాస్‌పై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించంది. హమాస్ యోధులు ఇజ్రాయెల్ లోకి చొరబడి సైనికులపై కాల్పులు జరిపినట్లు సమాచారం.

గాజా స్ట్రిప్ సమీపంలో ఇజ్రాయెల్ సైనికులు, హమాస్ యోధుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడి ప్రారంభించింది. పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరగడం ఇదేం మొదటిసారి కాదు. 2021లో కూడా వీరిద్దరి మధ్య యుద్ధం జరిగింది. వాస్తవానికి ఇది ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణతో ప్రారంభమైంది. మరి ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ఏమిటో తెలుసుకుందాం.

ఇజ్రాయెల్-పాలస్తీనా భౌగోళిక స్థితి ఏమిటి?
ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యంలో ఉన్న యూదు దేశం. వెస్ట్ బ్యాంక్ దాని తూర్పు భాగంలో ఉంది. ఇక్కడ ‘పాలస్తీనా నేషనల్ అథారిటీ’ పాలస్తీనా ప్రజల కోసం ప్రభుత్వాన్ని నడుపుతుంది. దీనిని ఐక్యరాజ్యసమితి కూడా గుర్తించింది. ఇజ్రాయెల్ కు నైరుతి భాగంలో ఒక స్ట్రిప్ ఉంది. దాని చుట్టూ రెండు వైపులా ఇజ్రాయెల్, ఒక వైపు మధ్యధరా సముద్రం, మరొక వైపు ఈజిప్ట్ ఉన్నాయి. దీనిని గాజా స్ట్రిప్ అంటారు. వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌లను సాధారణంగా పాలస్తీనా అని పిలుస్తారు.

ఇవి కూడా చదవండి: Israel Palestina Crisis: హమాస్ దాడిలో 40 మంది మృతి, 500కు పైగా గాయాలు.. ఇజ్రాయెల్‭లో చల్లారని ఉద్రిక్తతలు

ఇజ్రాయెల్‌లో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఉంది. అయితే ఫతా పార్టీ వెస్ట్ బ్యాంక్‌లో ప్రభుత్వాన్ని నడుపుతోంది. గాజా స్ట్రిప్ హమాస్ ఆధీనంలో ఉంది. ‘పాలస్తీనా నేషనల్ అథారిటీ’ మాత్రమే పాలస్తీనాగా కనిపిస్తుంది. కానీ అందులో ఒక భాగంలో ప్రభుత్వం ఉంది. అంటే వెస్ట్ బ్యాంక్ కు కాస్త దూరంగా ఉన్న గాజా స్ట్రిప్‌పై పాలస్తీనా ప్రభుత్వానికి నియంత్రణ లేదు. 2007లో తిరుగుబాటు అనంతరం ఆ ప్రాంతాన్ని హమాస్ తన ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి హమాస్ పాలనే కొనసాగింది. ఇస్లాం, జుడాయిజం, క్రైస్తవ మతాల పవిత్ర నగరం జెరూసలేం వెస్ట్ బ్యాంక్‌లో ఉంది.

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ఏమిటి?
ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం 100 సంవత్సరాలకు పైబడింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సుల్తానేట్ ఓటమి తరువాత, పాలస్తీనా అని పిలువబడే భాగాన్ని బ్రిటన్ స్వాధీనం చేసుకుంది. అప్పట్లో ఇజ్రాయెల్ అనే దేశమే లేదు. ఇజ్రాయెల్ నుంచి వెస్ట్ బ్యాంక్ వరకు ఉన్న ప్రాంతాన్ని పాలస్తీనా భూభాగం అని పిలిచేవారు. అక్కడ యూదులు మైనారిటీ, అరబ్బులు మెజారిటీగా ఉండేవారు. పాలస్తీనా ప్రజలు ఇక్కడ నివసిస్తున్న అరబ్బులు, యూదు ప్రజలు బయటి నుండి వచ్చినట్లు చెబుతారు.

ఇవి కూడా చదవండి: Israel Palestina Crisis: అసలేంటీ ఈ హమాస్ ఉగ్రవాద సంస్థ? ఎందుకు ఇజ్రాయెల్ మీద 5,000 రాకెట్లతో దాడి చేసింది? పూర్తి వివరాలు తెలుసుకోండి

పాలస్తీనాను యూదు ప్రజలకు ‘జాతీయ నివాసం’గా ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ సమాజం బ్రిటన్‌ను కోరడంతో పాలస్తీనియన్లు, యూదుల మధ్య వివాదం మొదలైంది. ఇది తమ పూర్వీకుల ఇల్లు అని యూదులు విశ్వసించారు. మరోవైపు, పాలస్తీనా అరబ్బులు ఇక్కడ పాలస్తీనా పేరుతో కొత్త దేశాన్ని సృష్టించాలని కోరుకున్నారు. కొత్త దేశాన్ని ఏర్పాటు చేయాలనే బ్రిటన్ ఎత్తుగడను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విధంగా పాలస్తీనా-ఇజ్రాయెల్ వివాదం మొదలైంది.

కొత్త దేశాన్ని నిర్మాణం ప్రారంభం
1920 – 1940 మధ్య యూరప్‌లో యూదులపై దురాగతాలు జరిగాయి. ఎక్కడెక్కడో ఉన్న యూదులు పారిపోయి మాతృభూమిని వెతుక్కుంటూ ఇక్కడికి రావడం ప్రారంభించారు. ఇది తమ మాతృభూమి అని, ఇక్కడే తమ సొంత దేశాన్ని సృష్టిస్తామని యూదులు విశ్వసించారు. ఆ సమయంలో యూదులు, పాలస్తీనియన్ల మధ్య హింస కూడా జరిగింది. 1947లో ఐక్యరాజ్యసమితి యూదులు, అరబ్బుల కోసం ప్రత్యేక దేశాలను సృష్టించేందుకు ఓటు వేయాలని పిలుపునిచ్చింది. జెరూసలేంను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని ఐక్యరాజ్యసమితి హామీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి: Israel Palestina Crisis: యుద్ధం మొదలైంది, అంతకంతకూ పగ తీర్చుకుంటాం.. హమాస్ దాడి అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని సంచలన ప్రకటన

ఐక్యరాజ్యసమితి చేసిన ఈ ప్రకటనను యూదులు అంగీకరించినప్పటికీ, అరబ్ ప్రజలు వ్యతిరేకించారు. ఈ కారణంగా ఇది ఎప్పుడూ అమలు కాలేదు. ఈ సమస్యను బ్రిటన్ పరిష్కరించలేక అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత 1948లో యూదు నాయకులు ఇజ్రాయెల్‌ను సృష్టిస్తున్నట్లు ప్రకటించారు. పాలస్తీనియన్లు దీనిని వ్యతిరేకించారు. ఇరుపక్షాల మధ్య మొదటి యుద్ధం ప్రారంభమైంది. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే సమయానికి, ఇజ్రాయెల్ పెద్ద భాగాన్ని కలిగి ఉంది.

జెరూసలేంపై వివాదం
జోర్డాన్, ఈజిప్ట్ వంటి అరబ్ దేశాలు పాలస్తీనా ప్రజల కోసం పోరాడాయి. కానీ వారి ఓటమి కారణంగా పాలస్తీనా స్వల్ప భాగానికే పరిమితమైంది. జోర్డాన్ ఆధీనంలోకి వచ్చిన భూమికి వెస్ట్ బ్యాంక్ అని పేరు పెట్టారు. అయితే ఈజిప్టు ఆక్రమించిన ప్రాంతాన్ని గాజా స్ట్రిప్ అని పిలిచేవారు. అదే సమయంలో, జెరూసలేం నగరం పశ్చిమాన ఇజ్రాయెల్ భద్రతా దళాలు, తూర్పున జోర్డాన్ భద్రతా దళాల మధ్య విభజించబడింది. ఇదంతా ఎలాంటి శాంతి ఒప్పందం లేకుండానే జరిగింది.

1967లో మళ్లీ యుద్ధం ప్రారంభమైనప్పుడు, ఈసారి ఇజ్రాయెల్ తూర్పు జెరూసలేంతో పాటు వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత గాజా నుంచి ఇజ్రాయెల్ వైదొలిగింది, కానీ వెస్ట్ బ్యాంక్‌ను నియంత్రిస్తూనే ఉంది. ఇజ్రాయెల్ తూర్పు జెరూసలేంను తన రాజధానిగా పేర్కొంది. చాలా మంది పాలస్తీనియన్లు ఇప్పటికీ వెస్ట్ బ్యాంక్‌లో నివసిస్తున్నారు, కొందరు గాజా స్ట్రిప్‌లో నివసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Israel-Palestina: 5,000 రాకెట్లతో ఇజ్రాయెట్ మీద భీకర దాడి.. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం మొదలైనట్టే!

జెరూసలేం నగరం జుడాయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ అనే మూడు మతాలకు చాలా ముఖ్యమైనది. అల్-అక్సా మసీదు జెరూసలేంలో ఉంది. ఇది ఇస్లాంలోని అత్యంత పవిత్రమైన మసీదులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ టెంపుల్ మౌంట్ కూడా ఉంది. అక్కడ యూదు మతానికి చెందిన వారు ప్రార్థన చేస్తారు. ఇకపోతే, జెరూసలేంలోని క్రైస్తవులకు సంబంధించి చర్చ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఉంది. ఇది వారి ప్రధాన ప్రదేశం. ఈ ప్రదేశం యేసు క్రీస్తు మరణం, శిలువ వేయడం, పునరుత్థానం కథకు ప్రధానమైనది. ఈ కారణంగానే ఈ నగరానికి సంబంధించి మూడు మతాల ప్రజల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.