సిరియాపై టర్కీ సైనిక దాడి

  • Published By: venkaiahnaidu ,Published On : October 7, 2019 / 09:30 AM IST
సిరియాపై టర్కీ సైనిక దాడి

ఉత్తర సిరియాపై దాడి చేసేందుకు టర్కీ బలగాలు సిద్ధంగా ఉన్నాయని అమెరికా ప్రకటించింది. ఆదివారం హైట్ హౌస్ ఈ మేరకు విడుదల చేసిన ఓ ప్రకటనను బట్టి… ఇది గుట్టుచప్పుడు కాకుండా అమెరికన్ మద్దతుతోనే సిరియాపై టర్కీ దాడి చేయబోతున్నట్లు అర్థమవుతోంది.

సిరియాపై సైనిక దండయాత్ర గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తో మాట్లాడారని వైట్ హౌస్ తన ప్రకటనలో తెలిపింది. అయితే దాడి పరిధిని వివరించకుండా, “దీర్ఘ-ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్” గా దీనిని వౌైట్ హౌస్ వర్ణించింది.

అయితే అమెరికా సాయుధ దళాలు ఈ ఆపరేషన్‌కు మద్దతు ఇవ్వడం గానీ,పాల్గొనడం కానీ జరుగదని వైట్ హౌస్ తెలిపింది. ఐసిస్ ఆధీనంలోని భూభాగం “కాలిఫేట్”ను ఓడించి ఇకపై ఆ ప్రాంతంలో యునైటెడ్ స్టేట్స్ దళాలు ఉండవని ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతంలో ఐసిస్‌తో పోరాడే ప్రయత్నాలలో టర్కీ..అమెరికా మిత్రదేశంగా ఉంది.

సిరియాలో కుర్దిష్ సైనికులు కూడా అమెరికన్ బలగాలతో కలిసి పనిచేస్తున్నారు, కాని టర్కీ ఆ దళాలను తన శత్రువుగా భావిస్తుంది. కుర్దుల స్వతంత్ర మాతృభూమి కోసం పోరాడుతున్న కుర్దిష్ దళాలు… టర్కిష్ దళాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు తీవ్ర ప్రమాదంలో పడవచ్చు. ఆ కుర్దిష్ దళాలకు అమెరికా ఇచ్చిన మద్దతుపై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో టర్కీ అధ్యక్షుడు సమావేశం కానున్నారు.

మరోవైపు సిరియాపై ప్రపంచదేశాలు ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే అతిత్వరలో మనం ఊహించని విధంగా ఆయిల్ ధరలు పెరిగే అవకాశముందని సౌదీ యువరాజ్ బిన్ సల్మాన్ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే.