Covid-19 Origins : కరోనా మూలాలపై మరోసారి WHO దర్యాప్తు!

  కోవిడ్‌-19 ఆన‌వాళ్ల‌ను గుర్తించేందుకు మరోసారి WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ)విచార‌ణ చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయ‌ని యూఎస్ మీడియా రిపోర్ట్ చెబుతోంది. దాదాపు 20మంది సైంటిస్టులతో కూడిన

Covid-19 Origins : కరోనా మూలాలపై మరోసారి WHO దర్యాప్తు!

Who

Covid-19 Origins  కోవిడ్‌-19 ఆన‌వాళ్ల‌ను గుర్తించేందుకు మరోసారి WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ)విచార‌ణ చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయ‌ని యూఎస్ మీడియా రిపోర్ట్ చెబుతోంది. దాదాపు 20మంది సైంటిస్టులతో కూడిన WHO బృందం..కొత్త ఆధారాల కోసం దర్యాప్తు చేయనుందని వాల్ స్ట్రీట్ జర్నల్(WSJ)రిపోర్ట్ తెలిపింది. కాగా, చైనాలోని వూహాన్ సిటీలోనే కరోనా పట్టిందని..అక్కడి నుంచి ప్రపంచమంతా వైరస్ వ్యాపించిందన్నఆరోప‌ణ‌ల‌పై డ‌బ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం గ‌తంలో ద‌ర్యాప్తు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ బృందం వుహాన్‌పై ఎటువంటి అనుమానాలు లేవ‌ని స్ప‌ష్టం చేసింది.

వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ ప్రకారం..WHO ప్రాథమిక దర్యాప్తులో కరోనా వైరస్ మూలంకి సంబంధించి చైనీస్ శాస్త్రవేత్తలు అందించిన డేటా ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానమివ్వడానికి సరిపోదని తేలిన నేపథ్యంలోనే మరోసారి డబ్యూహెచ్ వో దర్యాప్తు చేయనుంది. లేబరేటరీ సేఫ్టీ మరియుబయోసెక్యూరిటీలో స్పెషలిస్టులు,జెనటిక్స్ నిపుణులతో కూడిన కొత్త సైంటిస్టుల బృందం..కరోనా వైరస్ ల్యాబ్ నుంచి పుట్టిందా లేదా అన్నదానిపై అద్యయనం చేయనుంది. అదేవిధంగా భవిష్యత్తు వైరస్ ప్రమాదాలపై మరియు వైర‌స్‌కు, మాన‌వుల‌కు ఉన్న లింకు గురించి విస్తృత అధ్యయనం చేయనుంది ఈ బృందం.

ALSOR READ యూజర్ల విమర్శలు.. దిగొచ్చిన ‘గూగుల్’.. సంచలన నిర్ణయం

కాగా,వైరస్ యొక్క మూలాన్ని పరిశోధించడానికి 2021 ప్రారంభంలో చైనాకు వెళ్లిన WHO నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం.. చైనా ముందు ఏ పరిశోధన చేస్తుందో స్పష్టమైన సమాచారాన్ని పొందడానికి కఫ్టపడాల్సి వచ్చింది.WHO నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం చైనా సందర్శనలో అడ్డంకులను ఎదుర్కొంది మరియు సమగ్రంగా మరియు నిష్పక్ష రీసెర్చ్ నిర్వహించడానికి పరిమిత అధికారాన్ని కలిగి ఉండింది. అయితే కరోనా చైనాలోనే పుట్టిందనడానికి ఎలాంటి ఆధారాల్లేవని డబ్యూహెచ్ వో దర్యాప్తు తర్వాత పేర్కొన్న విషయం తెలిసిందే. జనవరి, ఫిబ్రవరి నెలలో వుహాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో డబ్ల్యూహెచ్ఓ నేతృత్వంలోని బృందం వైరస్‌పై పరిశోధనలు చేసింది. ఈ వైరస్ బహుశా గబ్బిలాల నుంచి మనుషులు, లేదా మరొక జంతువు నుంచి వ్యాప్తి చెంది ఉందవచ్చని, లేదా ప్రయోగశాల నుంచి లీక్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టమైన కారణాలు లేవు.

ALSO READ బోర్డర్ లో వెనక్కు తగ్గని చైనా..సైనికుల కోసం 8 చోట్ల మాడ్యులర్ కంటెయినర్లు

మరోవైపు, కరోనా వైరస్ మూలాలపై రూపొందించిన నివేదికను ఈ ఏడాది ఆగస్టులో అమెరికా విడుదల చేసింది. అయితే ఈ రిపోర్టుని చైనా తిరస్కరించింది. ఈ రిపోర్టుని పూర్తిగా రాజకీయమైనది మరియు ఎలాంటి విశ్వసనీయత లేనిది మరియు ఈ రిపోర్టు సైన్సుకు వ్యతిరేకం అని చైనా విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు. కేవలం తన రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చిపెట్టే ఒక నివేదిక కోసం అమెరికా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిర్వహించిన పరిశోధనను సైతం పక్కనపెట్టేసిందని చైనా ఆరోపించింది.

యూఎస్ రిపోర్ట్.. అదనపు సమాచారం లేకుండా కరోనా వైరస్ మూలాలు ఎప్పటికీ ఖచ్చితంగా గుర్తించబడలేకపోవచ్చునని తెలిపింది. రిపోర్ట్ ప్రకారం..అమెరికా ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ వైరస్ మూలలపై భిన్నాభిప్రాయాలను కలిగి ఉంది. చైనాలో మొట్టమొదటగా బయటపడిన ఈ వైరస్ సహజసిద్ధంగా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందా లేదా ప్రమాదవశాత్తూ ల్యాబ్‌లో పుట్టిందా అన్న విషయంపై ఏజెన్సీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి.