Google : యూజర్ల విమర్శలు.. దిగొచ్చిన ‘గూగుల్’.. సంచలన నిర్ణయం

టెక్ దిగ్గజ కంపెనీలు యూజర్ల డేటాకు భద్రతా కల్పించడం లేదని, ప్రైవసీకి భంగం కలిగిస్తున్నాయని, నైతిక విలువలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Google : యూజర్ల విమర్శలు.. దిగొచ్చిన ‘గూగుల్’.. సంచలన నిర్ణయం

Google

Google : టెక్ దిగ్గజ కంపెనీలు యూజర్ల డేటాకు భద్రతా కల్పించడం లేదని, ప్రైవసీకి భంగం కలిగిస్తున్నాయని, నైతిక విలువలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలోనే యాప్ మార్కెట్, డెవలపర్స్ నుంచి గూగుల్ అడ్డు అదుపు లేకుండా కమిషన్ వసూలు చేస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read More : India : చైనాకు చెక్ పెట్టి.. తైవాన్ తో ఒప్పందం చేసుకున్న భారత్

ప్రస్తుతం ఈ ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇవే కాకుండా గూగుల్ క్లౌడ్ మార్కెట్ ప్లేస్ నుంచి స్మార్ట్ వేర్ ను ఇతరుల నుంచి కొన్నప్పుడు గూగుల్ కొంత శాతం డబ్బు తీసుకుంటుంది. దీనిపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ అడ్డగోలు దోపిడీని తగ్గించాలంటూ యూజర్లు సోషల్ మీడియాతోపాటు అనేక మాధ్యమాల ద్వారా ఏకిపారేయడంతో గూగుల్ దిగొచ్చింది.

గూగుల్‌ క్లౌడ్‌ ఫ్లాట్‌ఫామ్‌ పర్సంటేజ్‌ను 20 శాతం నుంచి 3 శాతానికి తగ్గించింది. గూగుల్ తీసుకున్న నిర్ణయంతో మధ్యవర్తులకు భారీగా ఊరట లభించనుంది. పోటీ ప్రపంచంలో ఆరోగ్యవంతమైన వాతావరణం కోసం, మిగతా కంపెనీలకూ అవకాశం ఇస్తూ పోటీతత్వాన్ని ప్రొత్సహించే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని గూగుల్‌ ప్రకటించుకుంది.

Read More : 3D Printed Vaccine : సూది అవసరం లేకుండా టీకా..ఎలా ఇస్తారు ? సాధ్యమేనా ?

ఈ ఏడాది మొదట్లో.. డెవలపర్స్‌ వార్షికాదాయంలో మొదటి 1 మిలియన్‌ డాలర్ల నుంచి సగం ఫీజు మాత్రమే యాప్‌ స్టోర్‌ సేవల కోసం వసూలు చేస్తామని గూగుల్‌ నిర్ణయించింది. విమర్శలు అధికమవుతున్న నేపథ్యంలో జులై 1వ తేదీ నుంచి యాప్‌ స్టోర్‌ ఫీజులను 30 నుంచి 15 శాతానికి తగ్గించినట్లు ప్రకటించింది గూగుల్‌.