3D Printed Vaccine : సూది అవసరం లేకుండా టీకా..ఎలా ఇస్తారు ? సాధ్యమేనా ?

అనారోగ్యంగా ఉంటే..ఏదైనా మందు శరీరంలోకి పంపించాలంటే..సూదీ అవసరం. ప్రస్తుతం కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు తీసకొచ్చిన వ్యాక్సినేషన్ ను కూడా సూదీ ద్వారా ఇస్తున్నారు.

3D Printed Vaccine : సూది అవసరం లేకుండా టీకా..ఎలా ఇస్తారు ? సాధ్యమేనా ?

Vaccine

3D Printed Vaccine : అనారోగ్యంగా ఉంటే..ఏదైనా మందు శరీరంలోకి పంపించాలంటే..సూదీ అవసరం. ప్రస్తుతం కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు తీసకొచ్చిన వ్యాక్సినేషన్ ను కూడా సూదీ ద్వారా ఇస్తున్నారు. అయితే..సూదీ అవసరం లేకుండానే…వ్యాక్సిన్ ఇచ్చేందుకు అమెరికా శాస్త్రవేత్తలు ఓ చిన్నపాటి పట్టీని అభివృద్ధి చేశారు. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే సాధారణ వ్యాక్సిన్ కన్నా..ఇది మెరుగ్గా పని చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

Read More : 

చర్మానికి ఈ పట్టీని అతికించడం ద్వారా…మంచి ఫలితాలు రాబొట్టచని, టీకా కన్నా..ఇది 10 రెట్లు సమర్థంగా పనిచేస్తుందంటున్నారు. రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన టి-కణ స్పందనను 50 రెట్లు ఎక్కువగా కలిగిస్తుందని, పాలీమర్ పట్టీపై త్రీడి ముద్రిత సూక్ష్మ సూదులను అమర్చడం ద్వారా దీనిని సిద్ధం చేశారు. వీటికి టీకా పూత ఉంటుంది. ఈ సూదులు చర్మంలో కరిగిపోతాయి. ఈ పట్టీని చర్మానికి అతికించుకోవడం ద్వారా…ఎవరికివారే టీకా పొందవచ్చు. ప్లూ, మీజిల్స్, హెపటైటిస్, కొవిడ్ – 19 టీకాలు ఇవ్వడానికి అనుగుణంగా..ఈ సూక్ష్మ సూదుల్లో మార్పులు చేపట్టవచ్చన్నారు.