China’s LAC Winter Plan : బోర్డర్ లో వెనక్కు తగ్గని చైనా..సైనికుల కోసం 8 చోట్ల మాడ్యులర్ కంటెయినర్లు

సరిహద్దులో చైనా మళ్లీ క్రియాశీలకంగా మారుతోంది. తూర్పు లడఖ్‌లో ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల మధ్య దౌత్య, సైనిక చర్చలు జరుగుతున్నప్పటికీ.. సరిహద్దుల్లో భారీగా సైనిక

China’s LAC Winter Plan : బోర్డర్ లో వెనక్కు తగ్గని చైనా..సైనికుల కోసం 8 చోట్ల మాడ్యులర్ కంటెయినర్లు

Lac

China’s LAC Winter Plan సరిహద్దులో చైనా మళ్లీ క్రియాశీలకంగా మారుతోంది. తూర్పు లడఖ్‌లో ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల మధ్య దౌత్య, సైనిక చర్చలు జరుగుతున్నప్పటికీ.. సరిహద్దుల్లో భారీగా సైనిక నిర్మాణాలను మాత్రం చైనా ఆపడంలేదు. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఏసీ)కు సమీపంలో చైనావైపున దాదాపు 8 ప్రదేశాల్లో చలిని కూడా తట్టుకుని తమ సైన్యం ఉండేందుకు వీలుగా ఆధునిక కంటెయినర్ ఆధారిత షెల్టర్లు(తాత్కాలిక గుడారాలు) చైనా ఏర్పాటు చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

ALSO READ  చైనాకు చెక్ పెట్టి.. తైవాన్ తో ఒప్పందం చేసుకున్న భారత్

పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA) సైనికుల కోసం ఉత్తరాన కరాకోరం కనుమ దగ్గర వహబ్ జిల్గా నుంచి LAC వెంట దక్షిణవైపు పీయూ, హాట్ స్ప్రింగ్స్, చాంగ్ లా, తాషిగాంగ్, మంజా, చురూప్ వరకు గుడారాలను నిర్మించింది. ప్రతి ప్రదేశంలో 80 నుంచి 84 కంటైనర్లు ఏడు క్లస్టర్లలో ఏర్పాటు చేసినట్లు సమాచారం. గతేడాది ఏప్రిల్-మేలో తూర్పు లడఖ్ లో సైనిక ప్రతిష్టంభన మొదలైనప్పటి నుంచి నిర్మించిన పులు నిర్మాణాలకు ఇవి అదనమని తెలుస్తోంది. భవిష్యత్తులో సైన్యాలను వెనుక్కు మళ్లించే ఉద్దేశం చైనాకు లేదని దీనిని బట్టి స్పష్టమవుతోంది.

మరోవైపు, సరిహద్దుల్లో భారత్, చైనాలు ఒక్కొక్కరూ దాదాపు 50వేల మంది సైనికులు, హౌవిట్జర్లు, ట్యాంకులు, ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలను ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. ఇరు సైనిక దళాలు క్రమం తప్పకుండా తమ సైనికులతో ఎత్తైన ప్రదేశాల్లోని క్లిష్టమైన ప్రాంతాల్లో గస్తీని కొనసాగిస్తున్నాయి. ఇదే సమయంలో విమానాలు, డ్రోన్‌లతో పరిస్థితిని గమనిస్తున్నాయి.

లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న 3,488 కి.మీ. ఎల్ఏసీ పొడవునా చైనా.. అనేక కొత్త వైమానిక స్థావరాలు, హెలిప్యాడ్‌లను అభివృద్ధి చేసింది. వీటికి తోడు ప్రధాన ఎయిర్ బేస్‌లైన హోతాన్, కాష్గర్, గర్గున్సా, లాసా-గొంగర్, షిగాట్సేలను పోరాట యోధులు, బాంబర్లతో అప్‌గ్రేడ్ చేసింది. ఒకవేళ భారత్ గగనతల దాడులు చేస్తే దీటుగా ఎదుర్కొనేందుకు రష్యాకు చెందిన S-400 ఉపరితల నుంచి గాల్లోకి ప్రయోగిచే క్షిపణులను గర్గున్సాలో చైనా మోహరించింది.

భారత్ కు చెందిన సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. లడఖ్‌లో కఠినమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. కానీ, సీపీఏల్ఏ సుదీర్ఘమైన విస్తరణ, విస్తృతమైన నిర్మాణాలను నిలుపుదల చేశాం. కఠినమైన పర్వత ప్రాంతాల్లో పనిచేయడం మన సైనికులు అలవాటు చేసుకోడం, చైనా సైనికులు అటువంటి పరిస్థితిని తట్టుకోలేకపోవడంతో వారి ధైర్యాన్ని ప్రభావితం చేసింది అన్నారు.

ALSO READ  ఈ స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ పనిచేయదట.. ఎప్పటినుంచో తెలుసా?