కాలాపానీ కోసం India-Nepal మధ్య గొడవెందుకు?

  • Published By: Subhan ,Published On : May 24, 2020 / 08:12 AM IST
కాలాపానీ కోసం India-Nepal మధ్య గొడవెందుకు?

ఉత్తరాఖాండ్‌లోని పీతోరాఘడ్ జిల్లా తూర్పు భాగంలో ఉన్న నేపాల్-ఇండియా మధ్యన ఉన్న కాలాపానీ గురించి గొడవ. నవంబరు 2019లో ఇండియా రివైజ్డ్ పొలిటికల్ మ్యాప్ పబ్లిష్ చేసినప్పటి నుంచి వాదన మొదలైంది. కొత్తగా ఏర్పడ్డ కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ అండ్ కశ్మీర్, లద్దఖ్ వల్ల సమస్య వచ్చిపడింది. ఇండియా, నేపాల్ లు రెండూ కాలాపానీ తమ ప్రాంతానికి చెందినదే అని గొడవపడుతున్నాయి. 

ఈ మ్యాప్ ప్రకారం.. కాలాపానీ ఉత్తరాఖాండ్ లోని పీతోరాఘడ్ జిల్లాకు చెందినదే. ఈ ఇష్యూ మీద నేపాల్ వెంటనే స్పందించింది. మే8న దార్చులా-లిపులేఖ్ పాస్ లింక్ రోడ్డు ఆవిష్కరించింది ఇండియా. ఈ రోడ్డు కాలాపానీ మీదుగా పోతుంది. ఫలితంగా కైలాస్ మానససరోవర్ ను వెళ్లే వారికి అనుకూలంగా ఉంటుందని భావించింది. నేపాల్ లో ఉండే ఇండియన్ అంబాసిడర్ వినయ్ మోహన్ ఖ్వాత్రా అప్పట్లో నేపాల్‌నే తిట్టిపోశారు. 

కాలాపానీ ఎక్కడ ఉందంటే:
కాలాపానీ ప్రాంతం కాలి నది నుంచి ఏర్పడింది. నేపాల్ సామ్రాజ్యం సరిహద్దులో నుంచి ఈ ప్రాంతం వచ్చిందని నేపాల్ ప్రభుత్వం అంటోంది. కాఠ్మాండుకు చెందిన గూర్ఖా రూలర్స్, గూర్ఖా యుద్ధం తర్వాతి ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య 1814-16 ఒప్పందం ప్రకారమే జరిగింది. దీని ప్రకారం.. నేపాల్ కుమావో-గఱ్వాల్ ప్రాంతాలను కోల్పోయింది. కాలి నది పడమర వైపునున్న హిమాలయాల నుంచి భారత ఉపఖండంలోకి ప్రవహిస్తున్నట్లు నేపాల్ రాజు చెప్తున్నారు.

ఈ ఒప్పందం ప్రకారం.. బ్రిటిష్ రూలర్స్ ఈ ప్రాంతంపై పూర్తి హక్కులు నేపాల్ కే ఉన్నాయని చెప్పారు. నేపాల్ నిపుణుల ప్రకారం.. కాలి నది తూర్పు నుంచే ఏర్పడింది. వివరాల ప్రకారం.. ఈ పర్వతాలు లింపియాధురా ప్రాంతానికి సమీపంలోనే ఉన్నాయి. నది ప్రవాహం కంటే లింపియాధురాలోని పర్వతాల ఎత్తు ఎక్కువగా ఉండటమే. మట్టి కొట్టుకువచ్చి లింపియాధురా సమీపంలో తూర్పుగా ఉన్న పర్వతాల దగ్గరే ఈ ప్రాంతం ఏర్పడింది. 

ఇండియా-నేపాల్ లకు మధ్య వివాదాలకు మానససరోవర్ యాత్ర పరోక్ష కారణం కాగా ఇవన్నీ సాకులుగా కనిపిస్తున్నాయి. 2015లో దీని కోసం లిపులేఖ్ ఒప్పందం కుదుర్చుకున్న ఇండియా, నేపాల్ లు దానిని పొడించినప్పటికి సమస్యకు అంతుచిక్కడం లేదు. 

ప్రస్తుత పరిస్థితి ఏంటి?
లింపియాధురా అధికారులు రివైజ్ చేసిన మ్యాప్ లో ఈ భూభాగం ముక్కోణపు ఆకారణంలో ఉన్న నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఉంది. మే22న ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి అధ్యక్షతన ఏర్పడిన క్యాబినెట్ మ్యాప్ లో దీనికి నియోజకవర్గ హోదాను కల్పించాలని ప్రతిపాదించింది. ఇండియా ప్రభుత్వం దీనికి భవిష్యత్ లో సరైన సమాధానం వెతకాలి. కానీ, కాఠ్మండులా దీనికి సొల్యూషన్ వెతకడమనేది అసాధ్యం.