Trump Diwali speech: గెలిస్తే భారత్-అమెరికా మధ్య బంధాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తా: ట్రంప్

అమెరికాలో 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే భారత్-అమెరికా మధ్య బంధాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తానని అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. రిపబ్లికన్ హిందూ విభాగం (ఆర్‌హెచ్ఎస్) 200 మంది భారత సంతతి అమెరికన్లతో ఫ్లోరిడాలోని తన రిసార్టులో నిర్వహించిన దీపావళి విందు కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ఈ సందర్భంగా ప్రసంగించారు. హిందువులు, భారత్, ప్రధాని మోదీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు.

Trump Diwali speech: గెలిస్తే భారత్-అమెరికా మధ్య బంధాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తా: ట్రంప్

FBI raids on Trump home

Trump Diwali speech: అమెరికాలో 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే భారత్-అమెరికా మధ్య బంధాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తానని అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. రిపబ్లికన్ హిందూ విభాగం (ఆర్‌హెచ్ఎస్) 200 మంది భారత సంతతి అమెరికన్లతో ఫ్లోరిడాలోని తన రిసార్టులో నిర్వహించిన దీపావళి విందు కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ఈ సందర్భంగా ప్రసంగించారు.

హిందువులు, భారత్, ప్రధాని మోదీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు. 2024 ఎన్నికల్లో తాను గెలిస్తే ఆర్‌హెచ్ఎస్ వ్యవస్థాపకుడు షలాభ్ కుమార్ ను భారత్ కు అమెరికా రాయబారిగా నామినేట్ చేస్తానని తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానా? అన్న విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదని చెప్పారు.

ఒకవేళ తాను పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తానని ట్రంప్ తెలిపారు. ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ అభ్యున్నతి కోసం తన వద్ద ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. పలు రాష్ట్రాల్లో హిందువుల మద్దతు లేకపోతే తాను 2016 ఎన్నికల్లో విజయం సాధించలేకపోయేవాడినని తెలిపారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..