Russia On Nuclear Weapons : అదే జరిగితే.. అణ్వాయుధాలను ప్రయోగిస్తాం- పశ్చిమ దేశాలకు రష్యా వార్నింగ్

అణ్వాయుధాల వాడకంపై పుతిన్‌ సర్కార్ మరోసారి స్పందించింది. కీలక వ్యాఖ్యలు చేసింది. తమ దేశ ఉనికికి ముప్పు ఎదురైనప్పుడు మాత్రమే..(Russia On Nuclear Weapons)

Russia On Nuclear Weapons : అదే జరిగితే.. అణ్వాయుధాలను ప్రయోగిస్తాం- పశ్చిమ దేశాలకు రష్యా వార్నింగ్

Russia On Nuclear Weapons

Russia On Nuclear Weapons : రష్యా-యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. దాదాపు నెల రోజులుగా యుక్రెయిన్‌పై రష్యా సేనలు దాడులు చేస్తున్నాయి. యుక్రెయిన్ పై రష్యా బలగాలు.. బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. యుక్రెయిన్‌లో రష్యా సేనలు భారీ విధ్వంసమే సృష్టించాయి. ఈ దాడుల్లో యుక్రెయిన్ సైన్యంతో పాటు సాధారణ ప్రజలూ అనేకమంది చనిపోయారు.

అయితే, పుతిన్ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ బలగాలు రష్యా దాడులను ధీటుగా తిప్పికొడుతున్నాయి. ఈ యుద్ధంలో వేల సంఖ్యలో రష్యన్ సైనికులను హతమార్చినట్లు యుక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది.(Russia On Nuclear Weapons)

Biological Weapons On Ukraine : యుక్రెయిన్‌పై రష్యా రసాయన, జీవాయుధాలు ప్రయోగించొచ్చు-బైడెన్ సంచలన వ్యాఖ్యలు

యుక్రెయిన్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన నేపథ్యంలో.. మాస్కో.. అణ్వాయుధాలను వినియోగించే అవకాశం ఉందని వచ్చిన వార్తలు కలకలం రేపాయి. రష్యా-యుక్రెయిన్ యుద్ధక్రమంలో అణు ప్రకటనలు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అణ్వాయుధాల వాడకంపై పుతిన్‌ సర్కార్ మరోసారి స్పందించింది. కీలక వ్యాఖ్యలు చేసింది. తమ దేశ ఉనికికి ముప్పు ఎదురైనప్పుడు మాత్రమే తాము అణ్వాయుధాలను ప్రయోగిస్తామని రష్యా తేల్చి చెప్పింది.

‘మాకు దేశీయ భద్రత అనే విధానం ఉంది. అది బహిర్గతమే. అణ్వాయుధాలు వాడటానికి గల కారణాలన్నీ మీరు చదవగలరు. ఈ సైనిక చర్య నేపథ్యంలో మా దేశానికి అస్థిత్వానికి ముప్పు ఏర్పడినప్పుడు మాత్రమే.. మా విధానానికి అనుగుణంగా మేం వాటిని ఉపయోగించవచ్చు’ అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ మీడియాకు తెలిపారు.

Russians Fight For Sugar : రష్యాలో దారుణ పరిస్థితులు.. చక్కెర కోసం ఎగబడ్డ జనాలు

ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక చర్య ప్రారంభించింది రష్యా. నాలుగు రోజుల తర్వాత ప్రపంచాన్ని కలవరానికి గురిచేసేలా అణ్వాయుధాలపై కీలక ప్రకటన చేసింది. తమ వ్యూహాత్మక అణ్వాయుధ బలగాలను అత్యంత అప్రమత్తంగా ఉంచినట్లు రష్యా వెల్లడించింది.

Russian Soldiers Killed : రష్యాకు బిగ్‌లాస్.. యుద్ధంలో 15,600 మంది సైనికులు మృతి-యుక్రెయిన్ ఆర్మీ

ఈ యుద్ధంలో రష్యాకు ఊహించని విధంగా నష్టం జరుగుతోంది. భారీ సంఖ్యలో రష్యా తన సైనికులను కోల్పోతోంది.నాలుగు వారాలుగా తమ దేశంలో రష్యా కొనసాగిస్తున్న దండయాత్రను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నట్టు యుక్రెయిన్ ఆర్మీ తెలిపింది. రష్యా సేనల దూకుడును దీటుగా ప్రతిఘటిస్తూనే.. శత్రుదేశాన్ని దెబ్బకొడుతున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకు 15వేల 600 మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్లు యుక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. అలాగే 101 విమానాలు, 124 హెలికాప్టర్లతో పాటు భారీగా యుద్ధ ట్యాంకులు, సాయుధ శకటాలు, వాహనాలను ధ్వంసం చేసినట్టు తెలిపింది.

మరోవైపు తమ దేశంపై దండయాత్ర కొనసాగిస్తున్న రష్యాపై ఆంక్షలను తీవ్రతరం చేసి ఒత్తిడి పెంచాలని యుయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ జపాన్‌ ప్రభుత్వాన్ని కోరారు. రష్యా వస్తువులపై వాణిజ్య నిషేధం ప్రకటించాలన్నారు. యుక్రెయిన్‌లో శాంతి పునరుద్ధరణకు ఆసియాలో తొలిసారి రష్యాపై ఒత్తిడి పెంచిన దేశం జపానేనన్నారు. ఈ మేరకు జపాన్‌ పార్లమెంట్‌ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో జెలెన్‌స్కీ ప్రసంగించారు.