Melted Silver : కరోనా రాకుండా ఉండాలని.. కరిగించిన వెండి తాగింది.. కన్నుమూసింది

కరోనా గురించి డాక్టర్లు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొంతమంది జనాలు మూఢనమ్మకాలతో, అంధ విశ్వాసాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముందు వెనుకా ఆలోచన చేయకుండా అపోహలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ముక్కులోకి నిమ్మరసం వేసుకుంటే కరోనా రాదని నమ్మి ఓ టీచర్ తన ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఇది మరువక ముందే.. అలాంటి దారుణం మరొకటి జరిగింది. కరిగించిన వెండిని తాగితే కరోనా సోకదని నమ్మి.. కరిగించిన వెండిని తాగి ఓ మాతాజీ మరణించిన ఘటన అమెరికాలో జరిగింది.

Melted Silver : కరోనా రాకుండా ఉండాలని.. కరిగించిన వెండి తాగింది.. కన్నుమూసింది

Amy Carlson

Melted Silver : కరోనా గురించి డాక్టర్లు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొంతమంది జనాలు మూఢనమ్మకాలతో, అంధ విశ్వాసాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముందు వెనుకా ఆలోచన చేయకుండా అపోహలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ముక్కులోకి నిమ్మరసం వేసుకుంటే కరోనా రాదని నమ్మి ఓ టీచర్ తన ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఇది మరువక ముందే.. అలాంటి దారుణం మరొకటి జరిగింది. కరిగించిన వెండిని తాగితే కరోనా సోకదని నమ్మి.. కరిగించిన వెండిని తాగి ఓ మాతాజీ మరణించిన ఘటన అమెరికాలో జరిగింది.


కొలరాడోలో జరిగిన ఈ వింత సంఘటన వివరాల్లోకి వెళితే అమి కార్లసన్ (45) అనే మహిళ ‘లవ్ హాస్ ఓన్’ అనే ఆధ్యాత్మిక సంస్థను నడుపుతోంది. శిష్యులందరూ ఆమెను ‘‘మదర్‌ ఆఫ్‌ గాడ్‌’’ అని పిలుస్తారు. కొద్ది రోజుల క్రితం ఆమె చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది.

దీంతో కార్లసన్ ఇంటికి వెళ్లిన పోలీసులకు అక్కడ కనిపించిన వింత దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఆమె ఇంట్లో దాదాపు 10మంది వరకు శిష్యులున్నారు. కార్లసన్‌ మృతదేహాన్ని ఓ వస్త్రంలో చుట్టి, బాక్సులో పెట్టి ఉంది. దాని చుట్టూ విద్యుద్దీపాలు అలంకరించి.. భజనలు, పూజలు చేస్తున్నారు. అది గమనించిన పోలీసులు వెంటనే వారందరినీ అదుపులోకి తీసుకుని కార్లసన్ మృతదేమాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. పోస్టుమార్టంలో మరిన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి.


కార్లసన్ ఈ యేడాది మార్చిలోనే చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. అంతేకాదు ఆమె ద్రవరూపంలో ఉన్న వెండిని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల చనిపోయినట్లుగా రిపోర్ట్ ఇచ్చారు. దీంతో పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కార్లసన్ 2018లో ‘లవ్ హాస్ ఓన్’ అనే ఆధ్యాత్మిక సంస్థను స్థాపించింది. ఆమెను దాదాపు లక్షన్నర మంది శిష్యులుగా మారారు. వీరంతా కార్లసన్ దాదాపు 19 బిలియన్ సంవత్సరాలుగా మానవత్వాన్ని కాపాడటం కోసం శ్రమిస్తుందని… ఏదో ఒక రోజు ఆమె తన శిష్యులను కొత్త లోకానికి తీసుకువెళ్లుందని నమ్ముతారు. అంతేకాదు పూర్వజన్మలో డొనాల్డ్ ట్రంప్ కార్లసన్ తండ్రి అని ఆమె శిష్యులు నమ్ముతున్నారు.