Amazon Packages: ఆర్డర్ ఇవ్వకుండానే వందల కొద్దీ అమెజాన్ డెలివరీ బాక్సులు

న్యూయార్క్ లోని ఓ మహిళ ఇంటికి ఎటువంటి ఆర్డర్ ఇవ్వకుండానే వందల కొద్దీ డెలివరీ బాక్సులు వచ్చిపడ్డాయి. జూన్ 5 నుంచి కొన్ని రోజులుగా అలా వస్తున్న డెలివరీ బాక్సులను చూసి ఎవరైనా సర్ ప్రైజ్ చేయడానికి చేశారా..

Amazon Packages: ఆర్డర్ ఇవ్వకుండానే వందల కొద్దీ అమెజాన్ డెలివరీ బాక్సులు

Amazon Delivery Boxes

Amazon Packages: న్యూయార్క్ లోని ఓ మహిళ ఇంటికి ఎటువంటి ఆర్డర్ ఇవ్వకుండానే వందల కొద్దీ డెలివరీ బాక్సులు వచ్చిపడ్డాయి. జూన్ 5 నుంచి కొన్ని రోజులుగా అలా వస్తున్న డెలివరీ బాక్సులను చూసి ఎవరైనా సర్ ప్రైజ్ చేయడానికి చేశారా.. లేదంటే ఇదేమైనా స్కాంలో భాగమా అని ఆలోచించిందట.

క్లారిటీ కోసం కస్టమర్ సపోర్ట్ కు కాల్ చేసి కనుక్కుందంట. పొరబాటున నా అడ్రస్ కు వచ్చాయేమో.. తాను రిటర్న్ చేయడానికి కూడా రెడీగా ఉన్నానని చెప్పింది. ఇదే సంగతి ఫేస్ బుక్ అకౌంట్లో కూడా పోస్టు చేసింది. కానీ, అమెజాన్ ఎగ్జిక్యూటివ్స్ అధికారికంగానే ఆ పార్శిల్స్ మీవేనని చెప్పి వెనక్కు తీసుకోమని చెప్పేశారు.

అసలు ఆ డెలివరీ బాక్సుల్లో ఏముందో తెలుసుకోవాలని ఓపెన్ చేసి చూడగా.. అందులో సిలికాన్ సంబంధిత ఫ్రేములు కనిపించాయి. అవి ఫేస్ మాస్కుల్లో వాడే పదార్థం అని కన్ఫామ్ చేసుకుంది. అప్పటికీ పార్శిల్స్ వస్తూనే ఉన్నాయి. వాటిపైన నో రిటర్న్ అని కూడా రాసి ఉంది.

బాక్సులపై ఉన్న బార్ కోడ్లు, ట్రాకింగ్ నెంబర్లతో వివరాల గురించి వెతకడం మొదలుపెట్టింది.

‘ముందుగా ఇదేదో స్కాం అనుకున్నా. వారి దగ్గర ఉన్న స్టాక్ క్లియర్ చేసుకోవడానికి ఇలా చేస్తున్నారని భావించా. ఎందుకంటే ఐటెంలన్నీ ఒకేలా ఉన్నాయి కాబట్టి’ అని ఆ మహిళ చెప్తుంది. మరోసారి అమెజాన్ కు ఫోన్ చేసి ఆర్డర్ల గురించి వివరించింది. ఊరికే వస్తున్నప్పటికీ ఆ పార్శిల్స్ తీసుకోవడానికి నో చెప్పినా ప్రయోజనం లేదు. ఇదంతా తెలియజేయడంతో అమెజాన్ అసలు ఓనర్ ను ట్రాక్ చేసింది.

లోకల్ చిల్ట్రన్ హాస్పిటల్ లో చిన్నారుల కోసం డీఐవై మాస్కులు చేయడం కోసం న్యూయార్కర్ వాటిని ఆర్డర్ చేసినట్లు తెలిసింది. ఆ మహిళ దాచి ఉంచిన డెలివరీ బాక్సులతో పాటు ట్రాన్సిట్ లో ఉన్న వాటిని కూడా అసలైన ఓనర్ కు అప్పగించారు.