కలికాలం.. తనను తానే పెళ్లి చేసుకున్న మహిళ.. మరి సంసారం ఎవరితో చేస్తుందో..

కలికాలం.. తనను తానే పెళ్లి చేసుకున్న మహిళ.. మరి సంసారం ఎవరితో చేస్తుందో..

Woman spends Rs 1 lakh to marry herself: కాలం మారిందంటారో, కలికాలం అంటారో.. మీ ఇష్టం. ఒకప్పుడు పెళ్లి అంటే.. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మధ్య జరిగేది. ఆ తర్వాత రోజులు మారాయి. లింగ బేధాల తారతమ్యం లేకుండా స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లు కూడా జరుగుతున్నాయి. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు పెళ్లాడటం తెలుసుకుని ముందు షాక్ కి గురయ్యాం. ఆ తర్వాత అలవాటు పడ్డాం. ఇప్పుడు అంతకుమించి విడ్డూరమైన పెళ్లిళ్లు జరుగుతున్నాయి.

Woman, 35, marries HERSELF after breaking up with her boyfriend | Daily Mail Online

ఇప్పుడు జరిగిన ఈ పెళ్లిలో వధువు మాత్రమే ఉంది. వరుడు ఉండడు. అలాగని ఆమె మరో యువతిని పెళ్లి చేసుకుందని అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే.. ఆమె ఒంటరిగా పెళ్లి చేసుకుంది.

SelfLove: 35-year-old woman marries self post breakup

అవును, అమెరికాకు చెందిన ఓ మహిళ తనను తానే వివాహం చేసుకుంది. ఆమె పేరు మెగ్ టేలర్ మోరిసన్. వయసు 35ఏళ్లు. అట్లాంటా నివాసి. ఇప్పుడీ మహిళ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వార్నీ.. అని ముక్కున వేలేసుకుంటున్నారు.

Woman, 35, marries HERSELF after breaking up with her boyfriend | Daily Mail Online

వాస్తవానికి టేలర్ ఓ అబ్బాయిని డీప్ గా లవ్ చేసింది. అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇందుకు ఏర్పాట్లు కూడా చేసింది. కానీ ప్రియుడు ట్విస్ట్ ఇచ్చాడు. ఆమెకి బ్రేకప్ చెప్పాడు. దీంతో టేలర్ అప్ సెట్ అయ్యింది. అయితే బ్రేకప్ వల్ల తన పెళ్లి ఆగిపోవడం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. అలాగని అప్పటికప్పుడు మరో అబ్బాయితో పెళ్లి చేసుకోడానికీ ఆమెకు సమయం లేదు. దీంతో టేలర్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వరుడు లేకుండానే తనను తానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించింది.

Woman, 35, marries HERSELF after breaking up with her boyfriend | Daily Mail Online

అంతేకాదు కొలరాడాలో పెళ్లి వేడుక ఏర్పాటు చేసింది. లక్ష రూపాయలు ఖర్చు చేసి మరీ ఏర్పాట్లు చేసింది. తన పెళ్లి వేడుకకు స్నేహితులు, బంధువులను ఇన్వైట్ చేసింది. పెళ్లి కోసం ప్రత్యేకంగా డైమండ్ రింగ్, కేక్ కొనుగోలు చేసింది. పెళ్లి కూతురు దుస్తుల్లో అందంగా ముస్తాబైంది. రింగ్ ను తన వేలుకు తానే తొడుక్కుంది. వేద మంత్రాలు చదివింది. ఆ తర్వాత అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని.. ముద్దాడి మురిసిపోయింది. అలా తనకు తానే పెళ్లి చేసుకుంది. ఓ పెళ్లి ఎలా జరుగుతుందో అచ్చం అలానే టేలర్ పెళ్లి కూడా జరిగింది. అయితే, ఇక్కడ వధువు మాత్రమే ఉంది. అంతే తేడా.. మిగతాదంతా సేమ్ టు సేమ్.

Woman, 35, marries HERSELF after breaking up with her boyfriend - ReadSector

కొన్నిరోజుల క్రితం డియోగో రాబెలో అనే వ్యక్తి ఈ విధంగానే పెళ్లి చేసుకున్నాడు. ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో తనని తానే పెళ్లాడాడు. ఇప్పుడు టేలర్ ఆ పని చేసింది. డియాగో మొదలెట్టిన ఈ కొత్త ట్రెండ్.. మున్ముందు ఎంతమంది ఫాలో అవుతారో చూడాలి. ఎవడి పిచ్చి వాడికి ఆనందం అంటే ఇదేనేమో అని నెటిజన్లు అంటున్నారు.

Médico decide casar consigo mesmo após término do noivado