Dual Gender Stick Insect : డబుల్ జెండర్ గొల్లభామ.. సగం ‘ఆడ’ సగం ‘మగ’

: డబుల్ జెండర్ గొల్లభామ అంటే సగం ‘ఆడ’ సగం ‘మగ’ ఉన్న పురుగుని కనుగొన్నారు.

Dual Gender Stick Insect : డబుల్ జెండర్ గొల్లభామ.. సగం ‘ఆడ’ సగం ‘మగ’

Dual Gender Stick Insect..half Male,half Female

Dual Gender Stick Insect..Half Male,Half Female : మనుషుల్లో మగవాడిగా పుట్టి ఆడ లక్షణాలు బయటపడితే వారిని హిజ్రాలు అంటారు. ఇటువంటి లక్షణాలు కేవలం మనుషుల్లోనే ఉంటాయా?జంతువుల్లోను..పురుగుల్లోను..ఉంటాయా? అనే అనుమానం మీకు ఎప్పుడన్నా వచ్చిందా? వచ్చిందో లేదో గానీ..అటువంటి ఓ వింత కీటకాన్ని అంటే.. సగం ఆడ..సగం మగ కలిగిన జీవిని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ రకమైన ప్రత్యేకమైన కీటకాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు.

10 Fascinating Facts About Stick Insects

Also read :Sea Dragon Dolphin: ఇది.. 180 మిలియన్ ఏళ్లనాటి భారీ ‘సీ డ్రాగన్ డాల్ఫిన్’ అస్థిపంజరం

ఆ కీటకాన్ని వాడుక భాషలో ‘గొల్లభామ’అంటాం. ఇది మిడతల జాతికి చెందినది. గాల్లో ఎగురుతుంది కూడా. చిన్నపాటి బరువును కూడా మోయగలదు. గొల్లభామ అని వాడుక భాషలో పిలిచే దీన్ని ఇంగ్లీష్ లో గ్రీన్‌బీన్‌ స్టిక్‌ ఇన్‌సెక్ట్‌ (Green Bean Stick Insect) అని పిలుస్తారు. బ్రిటన్‌కు చెందిన లారెన్‌ గార్‌ఫీల్డ్‌ ఓ గొల్లభామను పెంచుకుంటున్నాడు. దానికి ‘చార్లీ’అని పేరు కూడా పెట్టుకున్నాడు. దాన్ని ఎంతో ముద్దుగా పెంచుకుంటున్నాడు.

How did the unique insect which is half male and half female, understand  why this happened from the experts

Also read : 1,306 Legged Millipede : కళ్లు లేని..1,306 కాళ్లున్న అరుదైన జీవిని గుర్తించిన పరిశోధకులు

లారెన్ పెంచుకునే చార్లీకి అదే నండీ గొల్లభామకు ఉన్నట్టుండి శరీరం రంగు మారడం మొదలైంది. అలా రంగు మారటాన్ని గమనించిన లారెన్ ఆశ్చర్యపోయాడు వెంటనే అదేమిటో తెలుసుకోవటానికి చార్లీని శాస్త్రవేత్తలకు చూపించాడు. దాన్ని పరిశీలించి పరీక్షించిన శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే చార్లీ ఒక సగం ఆడ కీటకం, మరోసగం మగ కీటకమని గుర్తించారు. అదే విషయం లారెన్స్ కు కూడా చెప్పారు.దాంతో అతను కూడా ఆశ్చర్యపోయాడు.

Meet the dual-gender stick insect that is half-male and half-female | Daily  Mail Online

Also read : Monkeys Revenge on Dogs :కుక్కలపై పగ తీర్చుకున్న కోతులు..250 కుక్క‌పిల్లలను ఎలా చంపాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

సాధారణంగా ఈ రకం కీటకాల్లో మగవి ముదురు గోధుమ రంగులో చిన్నవిగా, ఆడవి లేత ఆకుపచ్చ రంగులో రెండింతలు పెద్దవిగా ఉంటాయి. చార్లీ ఆడకీటకంలా పెద్ద సైజులో ఒకవైపు ఆకుపచ్చ రంగులో ఉండగా, మరోవైపు ముదురు గోధుమ రంగులో మగ కీటకం లక్షణాలు ఉన్నాయి. ఈ తరహా కీటకాల్లో ఈ లక్షణాన్ని గుర్తించడం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు తేల్చడంతో.. పరిశోధనల కోసం లండన్‌ నేచురల్‌ హిస్టరీ మ్యూజియానికి ఇచ్చేశాడు.