2008లోనే కరోనా గురించి హెచ్చరించిన ప్రముఖ వైరాలజిస్ట్

2008లోనే కరోనా గురించి హెచ్చరించిన ప్రముఖ వైరాలజిస్ట్

future epidemics కరోనా వైరస్ పరిస్థితుల గురించి 12 ఏళ్ల క్రితమే ఓ ప్రముఖ వైరాలజిస్ట్ హెచ్చరించాడు. అయితే ఆయన హెచ్చరికలను ప్రపంచదేశాలు పెడచెవిన పెట్టడంతోనే ప్రస్తుతం ప్రపంచం ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు అర్థమవుతోంది. అప్పుడు అతను చెప్పినట్లే ఇప్పుడు జరుగుతోంది.

భవిష్యత్తులో వచ్చే వైరస్ మహమ్మారిల గురించి 2008లోనే అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత వైరాలజిస్ట్ నాథన్ వోల్ఫ్ హెచ్చరించారు. అంటువ్యాధులను ఎలా నిర్వహించాలో ప్రపంచానికి అర్థం కాలేదని వైరాలజిస్ట్ మరియు అంటు వ్యాధుల నిపుణుడు నాథన్ వోల్ఫ్ ఓ ఇంటర్యూలో హెచ్చరించారు. 50 సంవత్సరాలలో… ఈ చరిత్ర పీరియడ్ ని ప్రజలు తిరిగి చూసినప్పుడు..వ్యాధులను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాము..కానీ దాన్ని నియంత్రించలేకపోయాం అని వారు చెప్తారని తాను నమ్ముతున్నాను అని వోల్ఫ్ 2008లో ఓ ఇంటర్వ్యూలో హెచ్చరించాడు.

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ జంతువుల నుండి మానవులకు సోకినట్లు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అయితే, వోల్ఫ్ ఒక దశాబ్ద కాలంగా మధ్య ఆఫ్రికాలో ఇటువంటి పరస్పర చర్యలపై పరిశోధనలు చేస్తున్నారు. 2008లో వోల్ఫ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…అటవీ నిర్మూలన(deforestation) మరియు రహదారల నిర్మాణం కారణంగా… రిమోట్ బయోడైవర్స్ ప్రాంతాలు ఇప్పుడు ప్రజలతో మరింత అనుసంధానించబడి ఉన్నాయి.

ఈ మారుమూల గ్రామంలోని కొన్ని జంతువులతో సంప్రదించడం ఇంతకుముందు.. ఆ కమ్యూనిటీకి వైరస్ జంప్ అవడానికి దారితీసి ఉండవచ్చు, అది కొంతమందికి సోకి ఉండవచ్చు, బహుశా ఒక వ్యక్తికి సోకి ఉండవచ్చు, బహుశా చనిపోయి ఉండవచ్చు. ఇప్పుడు అకస్మాత్తుగా, ఆ మారుమూల గ్రామం వెంటనే ప్రధాన నగరానికి కనెక్ట్ అయి ఉంది. వాయు రవాణా మరియు షిప్స్ ద్వారా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది. ఎక్కడాలేని మధ్యలో ఏదో బకటి ఉందని అన్నారు.

మరోవైపు, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 మరణాలు 17 లక్షల 50వేలు దాటాయి. కేసుల సంఖ్య 8కోట్లకి చేరువలో ఉంది. 5కోట్ల 62లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. ఇక భారత్ లో అయితే, 1లక్షా 47వేలమందికి పైగా కరోనాతో మరణించగా..కేసుల సంఖ్య 1కోటి దాటిపోయింది. 97లక్షల మంది కోలుకున్నారు.