World Sleep Day 2023 : ‘ఆఫీసుకు రావద్దు..ఇంట్లోనే హాయిగా నిద్రపోండి’ ఆ కంపెనీ ఉద్యోగులకు బంపరాఫర్

‘ఆఫీసుకు రావద్దు..ఇంట్లోనే హాయిగా నిద్రపోండి అంటూ బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అంతేకాదు పనివేళల్లో కూడా అరగంటపాటు ఉద్యోగులు నిద్రపోవానికి అవకాశమిచ్చింది.

World Sleep Day 2023 : ‘ఆఫీసుకు రావద్దు..ఇంట్లోనే హాయిగా నిద్రపోండి’ ఆ కంపెనీ ఉద్యోగులకు బంపరాఫర్

World Sleep Day 2023

World Sleep Day 2023:  ఒక్కరోజు సెలవరు అడిగితే ఇవ్వని కంపెనీలున్నాయి. కానీ ఓ కంపెనీ మాత్రం తన ఉద్యోగులకు కనీవినీ ఎరుగను బంపరాఫ్ ఇచ్చింది. ‘ఆఫీసుకు రావద్దు..ఇంట్లోనే హాయిగా నిద్రపోండి’అంటూ బంపరాఫర్ ఇచ్చింది. ఎందుకంటే ఈరోజు అంటే మార్చి 17 అంతర్జాతీయ నిద్రా దినోత్సవం. నిద్రా దినోత్సవం సందర్బంగా బెంగళూరుకు చెందిన వేక్‌ఫిట్ సొల్యూషన్స్ అనే డీ2సీ హోమ్ అండ్ స్లీప్ సొల్యూషన్స్ స్టార్టప్ కంపెనీ తన ఉద్యోగులకు ఈ సదవకాశాన్ని కల్పించింది. దీనికి సంబంధించిన ప్రకటనను లింక్డ్‌ఇన్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. తమ ఉద్యోగులందరికీ పంపిన మెయిల్ స్క్రీన్‌షాట్. ‘సర్‌ప్రైజ్ హాలిడే: అనౌన్సింగ్ ది గిఫ్ట్ ఆఫ్ స్లీప్’ అని ట్యాగ్‌లైన్‌ ఇచ్చింది.

ఈ కంపెనీ తన ఉద్యోగులకు ఇటువంటి అవకాశాన్ని ఈ సంవత్సరమే కాదు గత ఏడాది కూడా ఇలాగే ఇచ్చింది. ‘రైట్ టు నాప్ పాలసీ’ని ప్రకటించింది. అంటే ఉద్యోగులందరూ తమ వర్కింగ్ టైమ్ లో కూడా 30 నిమిషాలు నిద్రపోవచ్చు. వర్కింగ్ టైమ్ లో 30నిమిషాలు వేస్టు అయిపోతాయని ఆ కంపెనీ అనుకోలేదు. ఆ నిద్రతో ఉద్యోగులు రీఫ్రెష్ అయి మరింత ఉత్సాహంగా పనిచేస్తారని భావించింది. కాసేపు కునుకు శరీరాన్ని చాలా ఫ్రెస్ గా ఉంచుతుంది. ఉత్సాహంగా పనిచేసుకోవటానికి సహకరిస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన సదరు కంపెనీ తన ఉద్యోగులకు అటువంటి అవకాశాన్ని కల్పించింది. ఇలా రీఫ్రెష్ అవ్వటం వల్ల ఉత్పాదకత శక్తి పెరుగుతుందని ఆ కంపెనీ భావిస్తోంది. అంతేకాదు..మరిన్ని కంపెనీలు కూడా తమ తమ ఉద్యోగులకు అటువంటి అవకాశాన్ని కల్పించాలని సూచిస్తోంది.

హాయిగా నిద్రపోండి : ప్రపంచ నిద్ర దినోత్సవం

అలా వరల్డ్ స్లీపింగ్ డే సందర్భంగా ఈ వినూత్న ఆఫర్ ఇచ్చిన కంపెనీ ప్రతినిథి మాట్లాడుతూ.. మా ఉద్యోగులందరికి ఈ రోజు సెలవు ఇచ్చామని.. మార్చి 17వ తేదీ శుక్రవారం అంతర్జాతీయ నిద్ర దినోత్సవాన్ని జరుపుకోనుందని ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నామని తెలిపారు. కాగా.. నిద్ర శరీరానికి విశ్రాంతినిచ్చే ప్రశాంత స్థితి. ఇది మానవులకే కాక జంతువులు..పక్షులు, ఇలా ప్రతీ ప్రాణికి నిద్ర చాలా అవసరం. ప్రతీప్రాణి బ్రతకటానికి నిద్ర చాలా అవసరం. ముఖ్యంగా మానవుల జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరమని..శారీరకపరంగా అత్యంత ముఖ్యమైనదని..నిద్ర ప్రతీ పౌరుని ప్రాథమిక హక్కని.ఆరోగ్య జీవనానికి నిద్ర చాలా అవసరమైనదని న్యాయస్థానాలు కూడా చెప్పాయి.

ప్రపంచ నిద్ర దినోత్సవం..ప్రతి సంవత్సరం మార్చి నెల మాడవ శుక్రవారం నాడు జరుపబడుతోంది. వరల్డ్ స్లీప్ సొసైటీకి చెందిన వరల్డ్ స్లీప్ డే కమిటీ (వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ స్లీప్ మెడిసిన్)ఆధ్వర్యంలో 2008 నుండి ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆరోగ్యకరమైన నిద్ర వల్ల కలిగే ప్రయోజనాలను తెలుపడం, నిద్ర సమస్యల భారం, వైద్య, విద్యా, సామాజిక అంశాలపై సమాజం దృష్టిని ఆకర్షించడం, నిద్ర రుగ్మతల నివారణ, నిర్వహణను ప్రోత్సహించడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం.

World Mental Health Day 2020 : ఒత్తిడిని జయించండి..హాయిగా నిద్రపోండి..