Russia – Ukraine War: ‘ప్రపంచంలోనే అతి పెద్దదైన యుక్రెయిన్ విమానాన్ని ధ్వంసం చేసిన రష్యన్లు’

ప్రపంచంలోనే అతిపెద్దదైన యుక్రెయిన్ విమానాన్ని రష్యన్లు ధ్వంసం చేసినట్లు యుక్రెయిన్ విదేశీ వ్యవహరాల మంత్రి మైత్రో కులేబా అన్నారు.

Russia – Ukraine War: ‘ప్రపంచంలోనే అతి పెద్దదైన యుక్రెయిన్ విమానాన్ని ధ్వంసం చేసిన రష్యన్లు’

Ukraine Plane

Updated On : February 28, 2022 / 7:30 AM IST

Russia – Ukraine War: ప్రపంచంలోనే అతిపెద్దదైన యుక్రెయిన్ విమానాన్ని రష్యన్లు ధ్వంసం చేసినట్లు యుక్రెయిన్ విదేశీ వ్యవహరాల మంత్రి మైత్రో కులేబా అన్నారు. నాలుగో రోజు కూడా మాస్కో నుంచి Kyiv దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. AN-225 ‘Mriya’ కల అనే అర్థం వచ్చే పేరున్న విమానం.. యుక్రెయినియన్ ఏరోనాటిక్స్ కంపెనీ ఆంటోనోవ్ తయారు చేశారు.

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో ఎయిర్‌క్రాఫ్ట్ గానూ క్వాలిఫై అయింది. రష్యా బలగాలు దానిని Hostomel ఎయిర్‌పోర్ట్ వద్ద కాల్చేశారు.

‘రష్యా ఆక్రమితదారులు ప్రపంచంలోనే అతిపెద్దదైన ‘Mriya’ను Kyivలోని ఎయిర్‌ఫీల్డ్‌కు సమీపంలో ధ్వంసం చేశారు. మీ కలలను దృఢంగా, స్వేచ్ఛగా, డెమొక్రటిక యుక్రెయిన్ తో సాకారం చేస్తాం’ అని యుక్రెయిన్ అధికారిక ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.

Read Also : పుతిన్‌కు షాక్.. ఆ పదవుల నుంచి తొలగింపు

‘వాళ్లు అతి పెద్ద విమానాన్ని ధ్వంసం చేయగలిగారు. కానీ, మా కలల్ని కాదు’ అని ట్వీట్ లో రాసి పోస్టు చేశారు.

విమానయాన సంస్థ Antonov విమాన ప్రస్తుత కండీషన్ గురించి చెప్పలేమని స్పష్టం చేసింది. ‘ప్రస్తుతం నిపుణులు పరీక్షించకుండా AN-225 పరిస్థితి గురించి చెప్పలేం. ఎయిర్ క్రాఫ్ట్ టెక్నికల్ కండీషన్ ప్రకటించలేం. అధికారిక అనౌన్స్ మెంట్ కోసం చూస్తూ ఉండండి’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.