Russia Ukraine War : పుతిన్‌కు షాక్.. ఆ పదవుల నుంచి తొలగింపు
పుతిన్ తీరుపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రపంచ దేశాలు పుతిన్ వైఖరిని నిరసిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

Putin (1)
Russia Ukraine War : ప్రపంచదేశాలు వద్దంటున్నా, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా లెక్కచేయని రష్యా అధ్యక్షుడు పుతిన్.. యుక్రెయిన్ పై యుద్ధం కొనసాగిస్తున్నాడు. వరుసగా 4వ రోజూ రష్యా సేనలు యుక్రెయిన్ పై బాంబులతో విరుచుకుపడ్డాయి. కాగా, పుతిన్ తీరుపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రపంచ దేశాలు పుతిన్ వైఖరిని నిరసిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
యుక్రెయిన్ పై దాడుల కారణంగా అమెరికా, నాటో కూటమి రష్యాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. పుతిన్ వ్యక్తిగత ఆస్తుల స్తంభన తదితర చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా అంతర్జాతీయ జూడో సమాఖ్య (ఐజేఎఫ్) పుతిన్ కు షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్లాదిమిర్ పుతిన్ ను హోదా నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాదు, పుతిన్ జూడో క్రీడాంశానికి ప్రపంచవ్యాప్త రాయబారిగా(అంబాసిడర్) వ్యవహరిస్తుండగా, ఆ పదవి నుంచి కూడా తప్పిస్తున్నట్టు ఐజేఎఫ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. మే నెలలో రష్యాలో నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని కూడా ఐజేఎఫ్ రద్దు చేసింది.
Russia Ukraine War : యుక్రెయిన్‌కు రూ.65 కోట్లు.. జపాన్ కుబేరుడి భారీ విరాళం
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఐజేఎఫ్ కు 2008 నుంచి గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పుతిన్ కు జూడో మార్షల్ ఆర్ట్ లో ప్రవేశం ఉంది. ఆయన జూడోలో 8వ డాన్ లెవల్ కు ఎదిగారు. 2014లో పుతిన్ కు ఈ మేరకు బెల్ట్ ప్రదానం చేశారు.
Russia Ukraine War : తగ్గేదే లే…అంటున్న యుక్రెయిన్ ప్రజలు
అటు, ఫిఫా వరల్డ్ కప్ ప్లేఆఫ్స్ లో రష్యాతో ఆడేందుకు చెక్ రిపబ్లిక్ వంటి దేశాలు నిరాకరించాయి. అంతేకాదు, రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరగాల్సిన చాంపియన్స్ లీగ్ ఫైనల్ ను యూఈఎఫ్ఏ మరో చోటికి మార్చింది. సెప్టెంబర్ 25న జరగాల్సిన రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా వన్ పోటీలు కూడా రద్దయ్యాయి.
Russia Ukraine war: సైనికుల ప్రాణాలు గాల్లో వదిలేసిన రష్యా, మెడికల్ ఎమర్జెన్సీ విధింపు
యుక్రెయిన్, రష్యా మధ్య భీకర పోరు నడుస్తోంది. నాలుగో రోజూ (ఫిబ్రవరి 27) యుక్రెయిన్‌పై బాంబులు, మిస్సైళ్లతో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. రాజధాని నగరం కీవ్‌లోకి ప్రవేశించేందుకు రష్యా సైన్యం యత్నిస్తోంది. యుక్రెయిన్ గ్యాస్, చమురు నిక్షేపాలు టార్గెట్
గా రష్యా సేనలు దాడులు చేస్తున్నాయి. కార్కివ్‌లోని గ్యాస్ పైప్‌లైన్‌ను రష్యా బలగాలు పేల్చేశాయి. కాగా, యుక్రెయిన్ సైనికులు తగ్గేదేలే అన‍్నట్టుగా తమ పోరాట పటిమను చూపిస్తున్నారు. శక్తివంచన లేకుండా రష్యా దళాలను తిప్పికొడుతున్నారు.