Russia Ukraine War : యుక్రెయిన్‌కు రూ.65 కోట్లు.. జపాన్ కుబేరుడి భారీ విరాళం
యుక్రెయిన్ కి భారీ విరాళం ప్రకటించారు. ఈ-కామర్స్ సంస్థ రాకుటెన్ వ్యవస్థాపకుడైన మికిటానీ... యుద్ధంలో నలిగిపోతున్న యుక్రెయిన్ కు రూ.65 కోట్లు అందిస్తున్నట్టు ప్రకటించారు.

Donation
Russia Ukraine War : యుక్రెయిన్ పై రష్యా దాడులకు ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. యుద్ధం, హింస మంచిది కాదని అన్ని దేశాలు గొంతెత్తుతున్నాయి. రష్యా తీరుని ముక్తకంఠంతో తప్పుపడుతున్నాయి. అదే సమయంలో రష్యా దమనకాండకు బలవుతున్న యుక్రెయిన్ కు క్రమంగా ప్రపంచదేశాల మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే ఈయూ దేశాలు ఆయుధాలు అందిస్తున్నాయి.
తాజాగా, జపాన్ కుబేరుడు హిరోషి మికీ మికిటానీ మరో అడుగు ముందుకేశారు. యుక్రెయిన్ కి భారీ విరాళం ప్రకటించారు. ఈ-కామర్స్ సంస్థ రాకుటెన్ వ్యవస్థాపకుడైన మికిటానీ… యుద్ధంలో నలిగిపోతున్న యుక్రెయిన్ కు రూ.65 కోట్లు అందిస్తున్నట్టు ప్రకటించారు. రష్యా దురాక్రమణను ప్రజాస్వామ్యానికి సవాల్ గా అభివర్ణించారు మికీ మికిటానీ. ఈ మేరకు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్ స్కీకి లేఖ ఆయన రాశారు.
Russia Ukraine war: సైనికుల ప్రాణాలు గాల్లో వదిలేసిన రష్యా, మెడికల్ ఎమర్జెన్సీ విధింపు
హింస కారణంగా ప్రభావితమైన యుక్రెయిన్ ప్రజల పట్ల సౌహార్ద చర్యగా ఈ విరాళం ఇస్తున్నానని తెలిపారు. కాగా, 2019లో తాను కీవ్ ను సందర్శించానని, జెలెన్ స్కీతోనూ భేటీ అయ్యానని మికిటానీ వెల్లడించారు. ప్రస్తుత సంక్షుభిత పరిస్థితుల్లో తాను యుక్రెయిన్ ప్రజల పక్షాన నిలుస్తున్నట్టు వివరించారు.
శాంతియుత, ప్రజాస్వామ్య దేశమైన యుక్రెయిన్ ను అన్యాయంగా అణచివేసే ప్రయత్నం చేయడం తనను ఆవేదనకు గురిచేస్తోందని, ప్రజాస్వామ్యానికి ఇది విఘాతం అని ఆయన వాపోయారు. త్వరలోనే ఈ అంశాన్ని రష్యా, యుక్రెయిన్ శాంతియుతంగా పరిష్కరించుకుంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మికీ.
రష్యా-యుక్రెయిన్ మధ్య నాలుగో రోజు(ఫిబ్రవరి 27) యుద్ధం కొనసాగుతోంది. వాసిల్కివ్ లోని ఓ చమురు డిపోపై రష్యా క్షిపణులతో దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతంలో గాలి విషపూరితంగా మారే ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు. అలాగే, ఈశాన్య నగరం ఓఖ్టిర్కాలోనూ రష్యా దాడులు జరపడంతో ఓ ఏడేళ్ల బాలిక సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి గవర్నర్ ప్రకటించారు.
ఇక కీవ్‌లో బాంబుల మోత వినపడుతూనే ఉంది. క్షిపణులతోనూ రష్యా దాడులు జరుపుతోంది. కీవ్ లోని అపార్ట్‌మెంట్ దగ్గరా బాంబులతో రష్యా దాడులు జరుపుతుండడంతో అమాయక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. కీవ్‌ను ఆధీనంలో తెచ్చుకుంటే రష్యా లక్ష్యం పూర్తయినట్లుగానే భావించాలి.
Russia Ukraine War : తగ్గేదే లే…అంటున్న యుక్రెయిన్ ప్రజలు
యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ నేతృత్వంలో ఆ దేశ సైన్యం ఏ మాత్రం భయపడకుండా యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. తాము ఆయుధాలను వీడబోమని యుక్రెయిన్ అధ్యక్షుడు తేల్చి చెప్పారు. కీవ్‌లో సాధారణ ప్రజలను కూడా యుద్ధానికి సిద్ధం చేశారు. మరోవైపు పలు దేశాలు ఆయుధాలు అందిస్తూ యుక్రెయిన్ కు సాయపడుతున్నాయి.