70ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన ప్రపంచంలోనే పురాతన అడవి పక్షి

విస్ డమ్ లేసన్ అల్బాట్రాస్(Laysan albatross).. ప్రపంచంలోనే పురాతమైన అడవి పక్షిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం దీని వయసు 70ఏళ్లు. ఇప్పుడీ పక్షి న్యూస్ లో హెడ్ లైన్ గా మారింది. ఓ బిడ్డకు జన్మనివ్వడమే ఇందుకు కారణం. అల్బాట్రాస్.. తల్లి అయ్యింది. ఫిబ్రవరి 1న పిల్లను పొదిగింది. నార్త్ ఫసిఫిక్ ఓషన్ లోని అభయారణ్యంలో ఈ పక్షి ఆశ్రయం పొందుతోంది.

70ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన ప్రపంచంలోనే పురాతన అడవి పక్షి

Worlds oldest wild bird has another chick: విస్ డమ్ లేసన్ అల్బాట్రాస్(Laysan albatross).. ప్రపంచంలోనే పురాతమైన అడవి పక్షిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం దీని వయసు 70ఏళ్లు. ఇప్పుడీ పక్షి న్యూస్ లో హెడ్ లైన్ గా మారింది. ఓ బిడ్డకు జన్మనివ్వడమే ఇందుకు కారణం. అల్బాట్రాస్.. తల్లి అయ్యింది. ఫిబ్రవరి 1న పిల్లను పొదిగింది. నార్త్ ఫసిఫిక్ ఓషన్ లోని అభయారణ్యంలో ఈ పక్షి ఆశ్రయం పొందుతోంది.

వాస్తవానికి.. లేసన్ ఆల్బాట్రోస్ జాతికి చెందిన పక్షులు 12 నుంచి 40ఏళ్లు మాత్రమే జీవిస్తాయి. అయితే విస్ డమ్ పక్షిని 1956లో పరిశోధకులు గుర్తించారు. ఈ పక్షి పార్టనర్ 2021 వరకు బతికుందని యూఎస్ వైల్డ్ లైఫ్ అధికారులు తెలిపారు.

Wisdom incubating her egg

గతేడాది(2020) నవంబర్ లో విజ్ డమ్.. గుడ్డు పెట్టింది. ఫిబ్రవరిలో పొదిగింది. గడ్డు పొదిగే వరకు ఆడ, మగ పక్షులు బాధ్యతలను సమానంగా తీసుకుంటాయి. గుడ్డు నుంచి పక్షి బయటకు వచ్చిన తర్వాత దానికి ఆహారం పెట్టే బాధ్యతలను పంచుకుంటాయి.

Wisdom caring for her chick

యూఎస్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీసెస్ ప్రకారం.. అల్బాట్రాస్ పక్షి తన జీవిత కాలంలో 30 నుంచి 36 పిల్లలకు జన్మనిస్తుంది. అదీ ఒక్క గుడ్డుని మాత్రమే పెడుతుంది. కొన్నేళ్ల పాటు దాన్ని పొదుగుతుంది. మిడ్ వే అటోల్ అభయారణ్యం.. ప్రపంచంలోని అల్బాట్రాస్ పక్షులకు ఆవాసం.

Wisdom the albatross with her newly-hatched chick