Oldest Whiskey Bottle: విస్కీ బాటిల్ అక్షరాలా కోటి రూపాయలు!

లిక్కర్ ఎంత పాతదైతే అంత రుచిగా ఉంటుందని మనం వింటుంటాం. అయితే.. అది కొంతకాలం వరకే ఈ సామెత. మహా అయితే ఒక దశాబ్దం పాటు లిక్కర్ పాతదైతే తాగొచ్చు. కానీ.. అదే శతాబ్దాల పాటు లిక్కర్ పాతదైతే తాగలేరు. కానీ.. అలాంటి లిక్కర్ కు చాలా డిమాండ్ ఉంటుంది. ఆ మాటకొస్తే ఆ లిక్కర్ బాటిల్ కూడా ఊహించని ధర పలుకుతుంది. ఇప్పుడు మీరు చదవబోతే స్టోరీ కూడా అలాంటిదే.

Oldest Whiskey Bottle: విస్కీ బాటిల్ అక్షరాలా కోటి రూపాయలు!

Oldest Whiskey Bottle

Oldest Whiskey Bottle: లిక్కర్ ఎంత పాతదైతే అంత రుచిగా ఉంటుందని మనం వింటుంటాం. అయితే.. అది కొంతకాలం వరకే ఈ సామెత. మహా అయితే ఒక దశాబ్దం పాటు లిక్కర్ పాతదైతే తాగొచ్చు. కానీ.. అదే శతాబ్దాల పాటు లిక్కర్ పాతదైతే తాగలేరు. కానీ.. అలాంటి లిక్కర్ కు చాలా డిమాండ్ ఉంటుంది. ఆ మాటకొస్తే ఆ లిక్కర్ బాటిల్ కూడా ఊహించని ధర పలుకుతుంది. ఇప్పుడు మీరు చదవబోతే స్టోరీ కూడా అలాంటిదే. రెండు వందల ఏళ్ల నాటి ఓ విస్కీ బాటిల్ ఏకంగా కోటి రూపాయల పైన ధర పలికింది.

అమెరికా బోస్టన్‌కు చెందిన హౌస్ స్కిన్నర్ ఇంక్ అనే కంపెనీ ఈ విస్కీ బాటిల్‌ని వేలం వేసింది. వేలం పాట వేసే ముందు దీని ధర 20-40 వేల డాలర్ల మధ్య అమ్ముడవుతుందని భావించినా అనూహ్యంగా అది ఊహించని ధర పలికింది. ఈ ఏడాది జూన్‌ 30న జరిగిన వేలంలో ఈ బాటిల్‌ను మిడ్‌టౌన్ మాన్హాటన్‌లోని మ్యూజియం, పరిశోధనా సంస్థ ది మోర్గాన్ లైబ్రరీ 1,37,500 డాలర్లకు సొంతం చేసుకుంది. అంటే అక్షరాలా మన కరెన్సీలో 1,02,63,019 రూపాయలు అనమాట. అయితే.. అసలు ఇంత ధరల పలికిన ఈ బాటిల్ చరిత ఏంటి అనుకుంటున్నారా..

ఇంగ్లెడ్యూ విస్కీని 1860లో ఈ బాటిల్‌లో నింపగా మొదట మోర్గాన్‌ లైబ్రరీకి అమ్మారు. ఆ తర్వాత అది ఆ లైబ్రరీ నుండి ఎలా వెళ్లిందో కానీ దాదాపుగా 1900లలో ఆ కాలపు ప్రసిద్ధ ఫైనాన్షియర్ జాన్ పియర్ పాయింట్ మోర్గాన్‌ జార్జియా పర్యటనలో ఈ విస్కీ బాటిల్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఆయన మరణం అనంతరం ఎస్టేట్‌ లోని గది నుండి ఆయన కుమారుడు స్వాధీనం చేసుకున్నారు. అతను దానిని 1942 -1944 మధ్య దక్షిణ కెరొలిన గవర్నర్ జేమ్స్ బైర్నెస్‌కు ఇవ్వగా ఆయన కూడా ఆ బాటిల్‌ని తెరకుండా అలానే ఉంచాడు.

ఇక బైర్నెస్‌ 1955లో పదవీవిరమణ చేసిన తరువాత బాటిల్‌ని ఆయన స్నేహితుడు, ఆంగ్ల నావికాదళ అధికారి ఫ్రాన్సిస్ డ్రేక్‌కు పంపగా అతను దానిని మూడు తరాల పాటు భద్రంగా దాచాడు. అప్పటికి ఈ విస్కీ బాటిల్ వయసు దాదాపు రెండు శతాబ్దాలకు చేరింది. కాగా.. ఇప్పుడు అమెరికా బోస్టన్‌కు చెందిన హౌస్ స్కిన్నర్ ఇంక్ అనే కంపెనీ ఈ బాటిల్ ను వేలం వేయగా మిడ్‌టౌన్ మాన్హాటన్‌లోని మ్యూజియం, పరిశోధనా సంస్థ ది మోర్గాన్ లైబ్రరీ సొంతం చేసుకుంది.