World Tallest Horse : ‘గిన్నిస్‌ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’క్రియేట్ చేసిన గుర్రం మృతి

ప్రపంచంలోనే పొడుగైన అరుదైన గుర్రం మృతి చెందింది. ‘బిగ్ జేక్’ అనే 20 సంవత్సరాల వయస్సున్న ఎత్తైన గుర్రంగా పేరొందింది. అంతేకాదు 6.10 అడుగులు ఎత్తు కలిగిన ఈ బిగ్ జేక్ 2010 లో ‘గిన్నిస్‌ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ సొంతం చేసుకుంది. అరుదైన రికార్డు సాధించిన ఈ గుర్రం తన 20 ఏళ్ల వయస్సులో చివరి శ్వాస విడిచింది.

World Tallest Horse : ‘గిన్నిస్‌ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’క్రియేట్ చేసిన గుర్రం మృతి

World's Tallest Horse Big Jake Dies

world’s tallest horse Big Jake dies : ప్రపంచంలోనే పొడుగైన అరుదైన గుర్రం మృతి చెందింది. ‘బిగ్ జేక్’ అనే 20 సంవత్సరాల వయస్సున్న ఈ అత్యంత ఎత్తైన గుర్రం 2010 లో ‘గిన్నిస్‌ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ను సొంతం చేసుకుంది. అరుదైన రికార్డు సాధించిన ఈ గుర్రం తన 20 ఏళ్ల వయస్సులో చివరి శ్వాస విడిచింది. బిగ్ జాక్ బెల్జియ‌న్ జాతికి చెందినది. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం, కొలంబియా కౌంటీలోని పోయ్‌నెట్టి గ్రామంలో ఓ గుర్రపు శాల‌లో ఇన్నాళ్లూ ఉంది. నిర్వాహకులు దీని ఆలనాపాలనా చూశారు. ఈక్రమంలో బిగ్ జాక్ గత రెండు వారాల నుంచి అస్వస్థతతో బాధపుతూ మృతి చెందింది. ఈ విషయాన్ని బిగ్ జాక్ య‌జ‌మాని జెర్రీ గిల్బర్ట్‌ భార్య వ‌లీషియా గిల్బర్ట్‌ వెల్లడించారు.

బిగ్ జాక్ మరణంపై యజమాని జెర్రీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. దానితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. బిగ్ జాక్ చనిపోవటం నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందని దానితో నాకు చాలా మంచి మంచి జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపారు. అయితే బిగ్ జాక్ జ్ఞాప‌కంగా ఇంతకాలం అది నివ‌సించిన స్టాల్‌ లో ఇక ఏ గుర్రాన్ని ఉంచకుండా ఖాళీగా ఉంచుతామని ఆ స్టాల్ కు కేవలం బిగ్ జాక్ కు మాత్రమే సొంతమని జెర్రీ గిల్బర్ట్ తెలిపారు. ఓ ఫలకంపై బిగ్ జాక్ బొమ్మ వేయించి..దాని పేరును చెక్కించి స్టాల్ బ‌య‌ట ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. బిగ్ జాక్ కు ఇచ్చే గౌరవంగా భావిస్తున్నామన్నారు.

జెర్రీ ‘బిక్ జాక్ గురించి చెబుతూ..అది పుట్టినప్పటి నుంచే అరుదైన గుర్రంగా పేరొందింది. సాధారణంగా బెల్జియం జాతి గుర్రాలు 100 నుంచి 140 పౌండ్ల(45 నుంచి 65 కిలోల) బ‌రువుతో పుడుతాయి. కానీ బిగ్ జాక్ మాత్రం అసాధార‌ణంగా 109 కిలోల(240 పౌండ్లు) బరువుతో అధిక బ‌రువుతో పుట్టిందని తెలిపారు. అలా బిగ్ జాక్ 6.10 అడుగులు ఎత్తు(2.1 మీట‌ర్లు) పెరిగిందని.. దాని బ‌రువు 1,136 కిలోలు(2,500 పౌండ్లు). ఇది నబ్రాస్కాలో పుట్టిందని వెల్లడించారు.