Xi Jinping: చైనా అధ్యక్షుడు జిన్‭పింగ్‭ను ఎవరూ నిర్భంధించలేదు.. ఇదిగో సాక్ష్యం

చైనాలో మావో జెడాంగ్ అనంతరం అత్యంత బలమైన నేతగా ఎదిగిన జిన్‭పింగ్.. ముచ్చటగా మూడోసారి చైనా అధినేతగా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఉండడంతో ఇద్దరు మంత్రులకు ఈ మధ్యే ఉరిశిక్ష విధించారు. నలుగురు అధికారులకు జీవిత ఖైదు విధించి జైలుకు పంపారు. తన అధ్యక్ష ఎన్నికపై ఇప్పటికే ఆయన ప్రచారం ఉదృతం చేశారు.

Xi Jinping: చైనా అధ్యక్షుడు జిన్‭పింగ్‭ను ఎవరూ నిర్భంధించలేదు.. ఇదిగో సాక్ష్యం

Xi Jinping makes first public appearance since SCO meet in sep 16

Xi Jinping: చైనాలో ఆర్మీ తిరుగుబాటు చేసి ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‭పింగ్‭ను గృహ నిర్భంధం చేసిందంటూ ప్రపంచ వ్యాప్తంగా వార్తలు గుప్పు మంటున్న నేపథ్యంలో.. ప్రజల ముందుకు వచ్చారు జిన్‭పింగ్. దేశ రాజధాని బీజింగ్ లో ఒక్కసారి ప్రత్యక్షమయ్యారు. చైనా ప్రభుత్వ అధికారిక మీడియా సీసీటీవీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పది రోజుల క్రితం షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం అనంతరం నాటి నుంచి పబ్లిక్‭గా జిన్‭పింగ్ కనిపించడం ఇదే మొదటిసారి.

ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే షాంఘై సమావేశం ఈ నెల 16న జరిగింది. అనంతరం నాటి నుంచి జిన్‭పింగ్ బయట ఎక్కడా కనిపించలేదు. ప్రపంచ మీడియాపై ఆయనపై అనేక రుమార్లు, కథనాలు ప్రచారం చేస్తున్నప్పటికీ చైనా అధికార పార్టీ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో జిన్‭పింగ్‭ను నిర్భంధించారనే రూమర్లకు మరింత బలం చేకూరింది. అయితే వీటన్నినీ పటాపంచలు చేస్తూ తాజాగా ఆయన ప్రజా సమూహం ముందు కనిపించడం గమనార్హం.

చైనాలో మావో జెడాంగ్ అనంతరం అత్యంత బలమైన నేతగా ఎదిగిన జిన్‭పింగ్.. ముచ్చటగా మూడోసారి చైనా అధినేతగా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఉండడంతో ఇద్దరు మంత్రులకు ఈ మధ్యే ఉరిశిక్ష విధించారు. నలుగురు అధికారులకు జీవిత ఖైదు విధించి జైలుకు పంపారు. తన అధ్యక్ష ఎన్నికపై ఇప్పటికే ఆయన ప్రచారం ఉదృతం చేశారు. అంతే కాకుండా చైనా కమ్యూనిస్ట్ పార్టీ 20వ జాతీయ కాంగ్రెస్ అభ్యర్థులను ఎన్నుకునే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు.