Rare Falcon : ఈ గద్ద ధర రూ.3.4 కోట్లు!!

సౌదీ అరేబియాలో ఓ డేగ (గ్రద్ధ) ఏకంగా భారీ ధర పలికి ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. సౌదీ అరేబియాలో జరిగిన వేలంలో ఈ తెల్లటి డేగ సుమారు రూ.3.4 కోట్లకు అమ్ముడైంది.

Rare Falcon : ఈ గద్ద ధర రూ.3.4 కోట్లు!!

Very Rare Egele

rare breed Falcon cost world record : సౌదీ అరేబియాలో ఓ డేగ (గ్రద్ధ) ఏకంగా భారీ ధర పలికి ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. సౌదీ అరేబియాలోని మల్హంలో జరిగిన వేలంలో అమెరికాకు చెందిన ఈ తెల్లటి డేగ ఏకంగా రూ.3.4 కోట్లకు అమ్ముడైంది. ఈ అరుదైన తెల్లటి జిర్‌ఫాల్కన్‌ డేగ జాతుల్లో అతి పెద్దది. ఎందుకింత అంటే.. సౌదీలో ఏళ్లుగా డేగలతో చిన్న జంతువులను వేటాడించే సంప్రదాయ ఆట ఒకటి ఉంది. దాన్ని ఫాల్కన్రీ అంటారు. ఈ వేట కోసం సౌదీలో ధనవంతులు ఈ వేటాడే పక్షులకు భారీ రేట్లకు కొంటారు. వాటితో వేటా సాగిస్తు..ఆనందం పొందుతారు.

ఎంత భారీ రేట్లకు కొన్నాగానీ..ఈ భారీ స్థాయి ధర మాత్రం గతలో ఎన్నడూ జరగలేదు.అందుకే ఈ తెల్లటి డేగ వార్తల్లోకొచ్చింది. ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఇంటర్నేషనల్‌ ఫాల్కన్‌ బ్రీడర్‌ వేలంలో 14 దేశాలకు చెందిన డేగల పెంపకందారులు పాల్గొన్నారు. సౌదీ టీవీల్లో, సోషల్‌ మీడియాలో ఈ వేలాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ జిర్ షాల్కన్ ను దక్కించుకోవటానికి పోటీ పడ్డారు. ఒకరిపై మరొకరు పైచేయి సాధిస్తు వేలంలో పోటీ పడ్డారు. కానీ ఓ వ్యక్తి మాత్రం దీన్ని సొంతం చేసుకున్నాడు.

అల్-ఆరడి ఫామ్‌లో పెరిగిన ఫాల్కన్‌కు మధ్యప్రాచ్యంలో అత్యంత ఖరీదైన ఫాల్కన్‌గా పేరుంది. 17 అంగుళాల పొడవు, 17 అంగుళాల వెడల్పుతో తీక్షణమైన కళ్లతో చూపు తిప్పుకోనివ్వని రాజసంతో కనిపిస్తుంది. ఈ ఫాల్కన్ 1,105 కిలోగ్రాముల బరువు ఉంటుంది. ఇన్ని విశేషాలు ఉన్న ఈ ఫాల్కన్ ను ముతాబ్ మునీర్ అల్-అయాఫీ అనే ప్రముఖ వ్యాపారవేత్త అత్యధిక ధరకు దక్కించుకున్నారు. లం వేయగా వచ్చిన ఈ డబ్బులో కొంత భాగం అంటే సౌదీ కరెన్సీ 300,000 రియాల్‌ లు ఇస్తారు.

ఈ అరుదైన ఫాల్కన్ ను దక్కించుకున్న ముతాబ్ మునీర్ మాట్లాడుతు..మా పూర్వీకుల నుండి డేగలను పెంచే అభిరుచి ఉందని అదే నాకు వచ్చిందని తెలిపారు. మేము ఈగల్స్ సహాయంతో వేటాడతాం..డేగలను పెంచడమే కాదు..గుర్రాలను కూడా పెంచుతామని తెలిపారు. గుర్రపు స్వారీ అంటే నాకు చాలా ఇష్టమని ఖరీదైన గుర్రాలను పెంచడం నా అభిరుచి అని తెలిపారు.